Tata Car Viral Video: మనకు తెలిసినంతవరకూ టాటా కంపెనీకు చెందిన నానో కారు అతి చిన్నకారు. అంతకంటే చిన్న కారు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ రోడ్లపై హల్‌చల్ చేస్తున్న ఈ కారు నానో కంటే చిన్నది. ఇది కూడా టాటా కంపెనీదేనట. టాటాకంపెనీ మాత్రం తెలియదంటోంది. ఆశ్చర్యంగా ఉంది కదా..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో క్రియేటివిటీకు కొదవ లేదు. ప్రతి రంగంలోనూ ఎవరికి తగ్గ క్రియేటివిటీ వారు ప్రదర్శిస్తున్నారు. కొన్ని అమితాశ్చర్యాన్ని కల్గిస్తుంటాయి. అలాంటి సృజనాత్మకతే ఇప్పుడు ఓ కారులో కన్పించింది. కార్ మోడిఫికేషన్ వీడియో ఇది. ఈ వీడియో ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న అతి చిన్న కారు ఇదే. ఈ కారు పరిమాణం నానో కంపెనీ కంటే చిన్నది. అంతేకాదు ఈ కారు కూడా టాటా కంపెనీదే కావడం విశేషం. అయితే టాటాకు మాత్రం ఈ కారు గురించి అవగాహన లేదు. మీరు నమ్మలేకున్నా ఇదే నిజం. టాటా ఇండికా కారును ఎంతో అద్భుతంగా మోడిఫై చేసి 2 డోర్ కారుగా తీర్చిదిద్దారు.


2 డోర్స్ టాటా ఇండికా వీడియో వసీమ్ క్రియేషన్ పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్‌లో ఉంది. ఈ కారును అతి చిన్న వీల్‌బేస్ కారుగా ఎలా తీర్చారో చూడొచ్చు. పొడవు కూడా టాటా ఇండికాతో పోలిస్తే చాలావరకు తగ్గిపోయింది. ఈ మోడిఫైడ్ కారులో వెనుక డోర్లు తొలగించేశారు. కారు వెనుక భాగాన్ని కారు బీ పిల్లర్‌తో వెల్డింగ్ చేశారు. కారు బంపర్లకు మరమ్మత్తులు చేశారు. సైడ్ ప్రొపైల్‌లో కొత్త వీల్ కవర్ ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ డోర్స్ కలిపి రెండు డోర్స్‌గా కస్టమైజ్ చేశారు.



ఇక కారు ముందుభాగంలో రెండు హెట్ లైట్స్ కొత్తవి. ఈ కారును డార్క్ కలర్ వేశారు. కారు డ్యాష్ బోర్డును బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ వేశారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో షేర్ కాగానే భారీగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.


Also read: Hindu Priest Inaugurates Mosque: మసీదును ప్రారంభించిన స్వామీజీలు.. వైరల్ అయిన అద్భుత దృశ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook