Using Earphones ? : ఈయర్ ఫోన్స్, ఈయర్ బడ్స్, ఎయిర్‌పాడ్స్, నెక్‌బ్యాండ్స్... ఇలా పేరు ఏదైతేనేం చాలామందికి తమ స్మార్ట్ ఫోన్‌కి వయా బ్లూటూత్ అనుసంధానం చేసి ఏదో ఒక డివైజ్ చేసి యూజ్ చేయడం ఎప్పుడో సర్వసాధారణమైపోయింది. ఆఫీసులో పని చేసేటప్పుడు.. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు.. బైక్, కారు డ్రైవ్ చేసేటప్పుడు... ఇలా 24 గంటల్లో ఎక్కువ శాతం నాన్-స్టాప్ ఈయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్యే అధికం. కానీ ఈయర్ ఫోన్స్ ఉపయోగించే క్రమంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే.. దాని పర్యావసనాలు మరో రకంగా ఉంటాయి. ఆ పర్యావసనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాగ్జిమం వాల్యూమ్ లెవెల్
ఎక్కువ సౌండ్ పెట్టుకుని ఈయర్ ఫోన్స్ ఉపయోగిస్తే.. అది మీ వినికిడి శక్తిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈయర్ ఫోన్స్ లేదా ఈయర్ బడ్స్ ఉపయోగించి ఎక్కువ శబ్ధంతో ఆడియో వినడం వల్ల వినికిడి శక్తిని కోల్పోతారు. అందుకే 60 శాతం కంటే మించి ఎక్కువ శబ్ధంతో ఈయర్ ఫోన్స్ ఉపయోగించకుండా చూసుకోండి.


ఎక్కువసేపు వినియోగించడం
ఎక్కువసేపు ఈయర్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల మీ వినికిడి శక్తిపై దుష్ప్రభావం చూపిస్తుంది. మధ్యమధ్యలో బ్రేక్ ఇవ్వడం వల్ల మీ చెవిలోని కర్ణబేరి దెబ్బతినకుండా ఉంటుంది. ఇంకా వీలైతే.. రోజు మొత్తంలో ఒక గంట కంటే ఎక్కువసేపు ఈయర్ ఫోన్స్ ఉపయోగించకపోవడమే మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. 


నాయిస్ - క్యాన్సెలింగ్ ఈయర్‌బడ్స్
నాయిస్ - క్యాన్సెలింగ్ టెక్నాలజి కలిగిన ఈయర్‌బడ్స్ ఉపయోగించడం వల్ల స్పష్టమైన ఆడియో వినకలిగే అవకాశం ఉండటంతో పాటు బయటి శబ్ధాలు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. లేదంటే మీరు వినే శబ్ధం మధ్యలో బయటి శబ్ధాలు అంతరాయం ఏర్పడేలా చేసి మీ అనుభూతిని కోల్పోయేలా చేస్తుంది. అంతేకాకుండా మీ వినికిడి శక్తిపై అంతగా తీవ్ర ప్రభావం కూడా చూపించవు. అయితే, నాయిస్ - క్యాన్సెలింగ్ ఈయర్‌బడ్స్ అయినప్పటికీ.. ఎక్కువసేపు ఉపయోగించడం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు.


డ్రైవింగ్ చేసేటప్పుడు ఈయర్‌బడ్స్ ఉపయోగించడం
డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈయర్‌బడ్స్ ఉపయోగించే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈయర్‌బడ్స్ ఉపయోగించడం వల్ల డ్రైవింగ్‌పై మీ ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వెనుక నుంచి వచ్చే వాహనాలు కొట్టే హారన్ శబ్ధాలు వినపడే అవకాశం కూడా ఉండదు. జీవితానికి ఈ రెండూ ప్రమాదకరమే.


ఇది కూడా చదవండి : Safety SUV in India: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, తక్కువ ధర, అద్భుత ఫీచర్లు ఉంటే ఇక బ్రెజా ఎందుకు


ఈయర్‌బడ్స్ పరిశుభ్రంగా ఉంచండి
ఈయర్ బడ్స్ ఉపయోగించే ముందు వాటిని పరిశుభ్రంగా క్లీన్ చేయండి. మరీ ముఖ్యంగా మీ హెడ్ ఫోన్స్ ఎవరికైనా ఇచ్చినప్పుడు, తిరిగి వాటిని ఉపయోగించే ముందు క్లీన్ చేసుకోండి. లేదంటే కొన్ని సందర్భాల్లో హెడ్‌ఫోన్స్‌తో కూడా కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్, వైరస్‌లు వ్యాపిస్తుంటాయి.


ఇది కూడా చదవండి : Automatic Cars: దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే


ఇది కూడా చదవండి : Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK