Automatic Cars: దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే

Automatic Cars: ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆటోమేటిక్ కార్లంటే ఆసక్తి పెరుగుతోంది. కారణం అవసరం అలాంటిది మరి. రద్దీ ట్రాఫిక్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్ కార్లు సౌకర్యంగా ఉంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2023, 03:52 PM IST
Automatic Cars: దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే

Automatic Cars: మార్కెట్‌లో చాలా రకాల కార్లు ఉన్నాయి. మన సౌకర్యాన్ని బట్టి బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవల్సి ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ కార్లు, ఎస్‌యూవీలు, 5 సీటర్ కార్లు, 7 సీటర్ కార్లు, 8 సీటర్ కార్లు ఇలా వివిధ వేరియంట్లలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మనం చర్చించేది ఆటోమేటిక్ కార్ల గురించి..

కార్లలో రెండు రకాలుంటాయి. మేన్యువల్, ఆటోమేటిక్. మొన్నటి వరకూ అంతా మేన్యువల్ కార్లదే రాజ్యం. ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఆటోమేటిక్ కార్ల డ్రైవింగ్ మేన్యువల్ కార్లతో పోలిస్తే చాలా సులభంగా ఉంటాయి. అయితే ధర మాత్రం ఆటోమేటిక్ కార్లదే ఎక్కువ. రెండింటికీ 50-60 వేలు ఎక్కువగా ఉంటాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి ఆటోమేటిక్ కార్లు కావాలనుకుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం.. దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే మరి.

మారుతి సుజుకి వేగన్ ఆర్

మారుతి సుజుకి వేగన్ ఆర్ చాలా విలువైన కారు. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 లీటర్, 1.2 లీటర్ ఇంజన్లు ఉన్నాయి. ఇందులో 5 స్పీడ్ ఎంటీ, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ ధర 6.5 లక్షల రూపాయలు.

మారుతి సుజుకి ఆల్టో కే10

దేశంలో లభించే అత్యంత చౌకై ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ఇది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 65.7 బీహెచ్‌పి, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ ధర 5.59 లక్షల రూపాయలుంది.

మారుతి సుజుకి ఎస్ ప్రెసో

ఈ కారు మెకానిజం పూర్తిగా ఆల్టో కే10 లానే ఉంటుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కూడా 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు ఆటోమేటిక్  వేరియంట్ ధర 5.76 లక్షలుంది. 

Also read: Maruti Electric SUV: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ ఎప్పుడు , ఆ కారు ప్రత్యేకతలేంటి

టాటా టియాగో

టాటా కంపెనీ నుంచి అద్భుతమైన కారు ఇది. టాటా టియాగో కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తోంది. ఇది 84 బీహెచ్‌పి , 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ ధర 6.92 లక్షల రూపాయలుంది. 

రీనాల్ట్ క్విడ్

రీనాల్ట్ క్విడ్‌లో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. దీంతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ ధర 6.12 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. మీ బడ్జెట్‌ను బట్టి ఈ ఐదు కార్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్ వేరియంట్లలో అతి తక్కువ ధరకు లభిస్తున్న కార్లు ఇవే. 

Also read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News