Thirsty Snake: పాము చూస్తే ఆమడదూరం పారిపోయే వారుంటారు. కొంతమంది చనిపోయిన పామును చూసిన భయాందోళనలకు లోనవుతుంటారు. ఇలా చాలా మందికి పాములు అంటే భయంతో పారిపోయే వారున్న క్రమంలో ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేశాడు. దాహంతో ఉన్న ఓ పాముకు తన చేతుల్లో నీరు పోసి తాగించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పాము దాహం తీర్చిన వ్యక్తిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో 'వేసవి కాలం సమీపిస్తోంది. మీ గార్డెన్‌లోని కంటైనర్‌లో కొద్దిగా నీరు ఉంచండి. అలా చేయడం వల్ల జంతువుల ప్రాణాలను కాపాడిన వారవుతారు" అని సుశాంత్ నందా పోస్ట్ చేశారు. 


ఈ వీడియోలో నల్లని దుస్తులు ధరించిన ఓ వ్యక్తి చెట్టుపై ఉన్న పామును గమనించాడు. అయితే ఆ పాము దాహంతో ఉన్నట్లు గమనించిన అతడు.. తన చేతిలో నీటిని పోసుకొని పాముతో తాగించాడు. ఆ పాము దాహంతో ఉన్న కారణంగా నీటిని తాగుతూనే ఉంది. పాము దాహాన్ని గమనించిన ఆ వ్యక్తి నీటిని పోస్తూనే ఉన్నాడు. చివరికి ఆ పాము దాహం తీరిన తర్వాత తలపైకి లేపి చూసింది. 


[[{"fid":"224651","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. పాముకు దాహం తీర్చడాన్ని ప్రశంసిస్తూ.. నెటిజన్లు అనేక పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆ పాము నుంచి జాగ్రత్త వహించాల్సింది అని కామెంట్ చేస్తున్నారు. విషపాముల నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలని వారు సూచిస్తున్నారు.  


Also Read: Gang War Video: రోడ్డు మధ్యలో యువతుల 'గ్యాంగ్ వార్'- తీరిగ్గా చూస్తున్న జనం!


Also Read: Accident Viral Video: హెల్మెట్ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook