Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు... ఇదిగో ఇలా...
Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలేంటో, బలహీనతలేంటో చెప్పొచ్చు... ఇందులో మీ చూపు మొదట దేనిపై పడుతుందో.. దాన్నిబట్టి మిమ్మల్ని అంచనా వేయొచ్చు...
Optical Illusion : ఆప్టికల్ ఇల్యూజన్స్ మెదడుకు పదును పెడుతుంటాయి. తీక్షణంగా చూస్తే తప్ప అందులో దాగున్న నిగూఢ చిత్రమేమిటో అర్థం కాదు. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో ఒకటికి మించిన చిత్రాలు ఉండటం లేదా ఒకే చిత్రంలో నిగూఢత ఏదో దాగుండటం కామన్. అలాంటిదే ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌ని ఇక్కడ గమనించవచ్చు. ఇందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక టేబుల్, ఒక చైర్ ఉన్నాయి. ఇందులో మొదట మీ దృష్టి దేనిపై పడుతుందో... దాన్నిబట్టి మీ బలాలు, బలహీనతలు చెప్పొచ్చు.
1) మీ చూపు మొదట 'అతని'పై పడితే :
మీ చూపు మొదట ఆ ఆప్టికల్ ఇల్యూజన్‌లోని పురుషుడిపై పడిందంటే.. భావోద్వేగపరంగా, మానసికంగా మీరు గొప్ప సమతుల్యత కలిగిన వ్యక్తి. క్లిష్ట సమయాల్లోనూ కుంగిపోకుండా ముందుకు సాగుతారు. సవాళ్లను స్వీకరించేందుకు ఏమాత్రం భయపడరు. స్థిరత్వంతో, సామర్థ్యంతో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఇతరుల ముందు స్పూర్తివంతంగా నిలుపుతాయి. అయితే మీకు కూడా కొన్ని ఫెయిల్యూర్స్ తప్పవు. కొన్నిసార్లు ఎమోషన్స్‌ను వ్యక్తపరచకపోవడం మిమ్మల్ని కుటుంబానికి, స్నేహితులకు దూరం చేస్తుంది.
2) మీ చూపు మొదట 'ఆమె'పై పడితే
ఆ ఫోటోలో బుక్ చదువుతున్న అమ్మాయి కనిపిస్తుంది కదా. మీ చూపు మొదట ఆమెపై పడినట్లయితే... మీరొక గొప్ప ఇంటలెక్చువల్ అని అర్థం. నిరంతరం కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్తవి నేర్చుకోవడానికి ఇష్టపడుతారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ మిమ్మల్ని ఆకర్షించిందంటే అందులో పూర్తిగా మునిగి తేలుతారు. అయితే మీకు ఆసక్తి లేదని చెప్పి కొన్ని ముఖ్య విషయాలను సైతం పక్కనపెట్టడం మీ బలహీనత. మీ లాంటి ఆసక్తి, అభిరుచి లేవని చెప్పి మీ చుట్టు ఉన్నవాళ్లలో కొంతమందిని దూరం పెడుతారు. ఇది మీకు చెడు పేరు తీసుకొస్తుంది.
3)మీ చూపు ఆ 'టేబుల్'పై పడితే :
మీ చూపు గనక మొదట ఆ టేబుల్‌పై పడినట్లయితే.. మీరు గొప్ప శ్రోత అని అర్థం. ఇతరులు చెప్పే విషయాలను ఎప్పుడూ ఓపికగా వింటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో అంత గొప్పగా వ్యవహరించరు. ఇతరులకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికీ... మీ విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
4) మీ చూపు ఆ 'కుర్చీ'పై పడితే
మీ చూపు మొదట ఆ కుర్చీపై పడినట్లయితే.. మీ ఆలోచనా ధోరణితో యునిక్‌గా ఉంటుంది. ఇతరులతో పోలిస్తే మీరు సమస్యలను చూసే దృక్పథం భిన్నంగా ఉంటుంది. దాంతో ఇతరుల కన్నా మిన్నగా సమస్యలకు పరిష్కారం చూపగలరు. అయితే ఒకే విషయంపై ఎక్కువ కాలం ఫోకస్ చేయలేకపోవడం మీ బలహీనత. మీ చుట్టు ఉన్న పరిస్థితుల కారణంగా మీరలా వ్యవహరిస్తారు.
Also Read: Krishna Viral Photo: సూపర్‌స్టార్ కృష్ణ ఫోటో వైరల్... ఆయనకేమైందని ఫ్యాన్స్ ఆందోళన...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook