School Girl saved a Pregnant Woman: సోషల్ మీడియాలో రకరకాల వైరల్‌ వీడియోలను ఆసక్తిగా చేసుతుంటాము.. కానీ మానవత్వాన్ని ప్రతిబింబించే (Humanity Video) కొన్ని సంఘటనలు మరియు వీడియోలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులోను స్కూలుకు వెళ్లే  పాప చేసిన పనికి ఆ చిన్నారి కల్మషం లేని మనసు.. ఇతరులకు సహాయ పడే గుణం ఎంతో ప్రశంసనీయం. ఈ పాప చేసిన పనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. 


వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ఒక గర్భిణీ ఆటోలో ప్రసవవేదనతో అల్లాడుతోంది.. ఆ ఆటో టైర్ పంచర్ అవటంతో పక్కన ఆపి డ్రైవర్ ఆటో టైర్ మారుస్తున్నాడు. అంతలో ప్రసవ వేదనతో ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. 


Also Read: RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్


ఆటో పంచర్ అవ్వటంతో ఆసుపత్రి వెళ్లటానికి దారి లేకపోవటం.. ఆ మహిళ నొప్పితో కేకలు వేయడంతో... ఆటో డ్రైవర్ కంగుతిన్నాడు.  ఏం చేయాలో అర్థం కానీ స్థితిలో ఆటో డ్రైవర్.. సాహయం కోసం వచ్చే వాహనాలను ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. 


గర్భిణీకి సాయం చేసిన చిన్న అమ్మాయి 
రోడ్డుపై వెళ్తున్న అన్ని వాహనాలను ఆపటానికి ఆటో డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. చాలా వాహనాలు అటుగా వెళ్లటం వీడియోలో మనం చూడవచ్చు.. కానీ ఎవ్వరు సాయం చేయటానికి రాకపోగా.. కనీసం ఏమైందని అడగకపోవటం గమనార్హం. 




కాసేపటికి అటుగా వెళ్తున్న బిఎమ్‌డబ్ల్యూ (BMW Car) కారు, ఆటో ముందు నుండి వెళ్లి.. మళ్లీ వెనక్కి రావటం వీడియోలో చూడవచ్చు. ముందుగా కారులోంచి చిన్న పాప దిగటం మనం చూడవచ్చు.. స్కూల్ యూనిఫారం ధరించిన పాప (School Girl) దిగటం.. ఆటో దగ్గరకి వెళ్లి చూడటం.. కారులోంచి వాటర్ బాటిల్ తీసుకొని నొప్పితో ఉన్నగర్భిణీకి ఇవ్వటం మనం చూడవచ్చు. 


Also Read: Cake prank Viral Video : భారీ కేక్‌ను నేలపాలు చేశారని షాక్ అయిన వధూవరులు, ట్విస్ట్‌ ఇచ్చిన హెటల్ సిబ్బంది


ఆ తరువాత, చిన్న అమ్మాయి కారు వద్దకు వెళ్లి అందులో కూర్చున్న కుటుంబ సభ్యులను తీసుకొని రావటం చూడవచ్చు. తరువాత గర్భిణీని ఆటోలోంచి దించి, ఆసుపత్రికి తీసుకెళ్లటం తీసుకెళ్తుంది. సోషల్ మీడియాలో (Social Media) ఈ వీడియో పోస్ట్ చేయటంతో చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. 


ఈ వీడియో మానవత్వానికి ఒక ఉదాహరణ.. 
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ధరమ్‌వీర్ మీనా (IFS officer Dharamveer Meena) ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ పాపకు సెల్యూట్’ (Salute to this Baby) అంటూ ట్యాగ్ లైన్ రాసి అప్లోడ్ చేసారు. ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో సంఘటన సాధారణంగా లేదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.. కానీ ఈ వీడియో స్క్రిప్ట్‌గా ఉన్నప్పటికీ, దాని ద్వారా వ్యాపించే సందేశం సృజనాత్మకంగా ఉందని.. మానవత్వాన్ని చాటిచెప్పే విధంగా ఉందని మరికొంత మంది అంటున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి