COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Tiger Viral Video: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటినుంచి సోషల్ మీడియా వినియోగం కూడా రెట్టింపు అయింది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా సులభంగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా పాములు జంతువులకు సంబంధించివి ఉండడం విశేషం. అయితే ఈరోజు ఓ పులికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటున్నాయి. జంతువులు వింత కార్యకలాపాలు చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలు అందరికీ నవ్వు పుట్టిస్తున్నాయి. జంతువులు చాలా అమాయకంగా ఉంటాయి. ఇలాంటి జంతువులే ఒక్కొక్కసారి వింత చేష్టలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  




వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే..మీరు ఈ వీడియోలో ఒక పులి నేలపై కూర్చోవడం గమనించవచ్చు. అయితే ఇంతలోనే ఆ పులి ఏం చేసిందంటే..ఒక్కసారిగా మనిషి తుమ్మినట్లు ఆ పులి కూడా తుమ్మింది. తుమ్మే ముందు చిరుత కూడా నోరు మెదపడం మీరు క్లియర్ గా చూడవచ్చు. ఆ తర్వాత పులి అలసట అంతా పోయినట్లు రిలాక్స్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇలాంటి పులులు చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పులులు కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇలా ప్రవర్తించిన వీడియోలే సోషల్ మీడియాను షేక్ చేస్తాయి.


ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో 'బుటెంగిబిడెన్' అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం పులి తుమ్మిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇప్పటికీ ఈ వీడియోను 4.8 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా..85 వేల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాకుండా ఈ వీడియోను చాలామంది రీట్వీట్ కూడా చేశారు.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook