Mother Elephant Video: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను కాపాడుకున్న తల్లి ఏనుగు!
Mother Elephant saves Baby Elephant from drowning in river. తాజాగా అమ్మ ప్రేమను చాటిన ఓ ఏనుగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mother Elephant saves Baby Elephant from drowning in river: ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. ఈ ప్రపంచంలో ఏ బంధంలో అయినా స్వార్ధం, స్వలాభం ఉంటాయేమో కానీ.. అమ్మ ప్రేమ మాత్రం స్వచ్ఛతకు మరో రూపం. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. అది మనుషులైనా, జంతువులైనా.. అమ్మ అమ్మే. పిల్లలకు ఏమైనా జరిగిందంటే.. ఆ తల్లి తట్టుకోలేదు. తాజాగా అమ్మ ప్రేమను చాటిన ఓ ఏనుగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన బిడ్డను ఓ తల్లి ఏనుగు కాపాడుకుని ఒడ్డుకు చేర్చుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నగ్రకాటా ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ ఏనుగుల గుంపు దాటుతోంది. పెద్ద ఏనుగులు అన్ని సునాయాసంగా ఆ నది ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరుతుండగా.. ఓ బుల్లి ఏనుగు మాత్రం ఇబ్బంది పడింది. తల్లి ఏనుగు వెనకాలే ఉండి సహకారం అందిస్తున్నా.. నీటి మధ్యలోకి వెళ్లిన బుల్లి ఏనుగు ఆ ప్రవాహ ధాటిని తట్టుకోలేకపోయింది. నీటిలో మునిగిపోతూ కొద్దిదూరం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే తల్లి ఏనుగు వెనకాలే వెళ్లి.. తొండం సాయంతో తన బిడ్డను ఆపింది.
నీటి ప్రవాహం మధ్యలో తల్లి ఏనుగు నిలబడి తన బిడ్డను తొండం సాయంతో చిన్నచిన్నగా ఒడ్డు వైపుకు తీసుకెళ్లింది. తల్లి సాయంతో బుల్లి ఏనుగు నెమ్మదిగా ఒడ్డుకు చేరుకుంది. ఆపై కొద్దీ దూరం వెళ్ళాక పైకి ఎక్కి వెళ్లిపోయాయి. ఇందుకు సంబందించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తన ట్విటర్‌లో పంచుకోగా.. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన అందరూ ఇది కదా తల్లి ప్రేమ అంటే అంటూ తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: IND vs IRE Records: ఐర్లాండ్ vs భారత్ టీ20 రికార్డులు ఇవే.. అత్యధిక రన్స్, వికెట్స్ వీరులు వీరే!
Also Read: Regina Cassandra Pics: తెల్లటి డ్రెస్సులో.. మల్లె పువ్వులా మెరిసిపోతున్న రెజీనా కసాండ్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.