Cat Making Pottery Video Viral: మీరు సోషల్ మీడియాలో (Social Media) పిల్లులు, కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎన్నో చూసి ఉంటారు. జంతువులలో.. కుక్కలు, పిల్లులు మానవులకు అత్యంత ప్రియమైనవి. కుక్కలు.. మనుషులకు ఎంతో విశ్వాసపాత్రమైన జంతువు. మరోవైపు పిల్లి ప్రజలకు చాలా ముద్దుగా ఉంటుంది.  అందుకే ప్రజలు పిల్లులను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లోని ఎలుకలను పిల్లి తింటూ..ఒక విధంగా మనుషులకు సహాయం చేస్తాయి. అయితే పిల్లికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో (Cat Funny video) నెట్టింట హల్ చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే... ఓ వ్యక్తి మట్టి కుండను తయారు చేస్తూ ఉంటాడు. అతడు తయారు చేయడాన్ని ఎదురుగా ఉన్న పిల్లి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. వెంటనే పిల్లి కూడా అతడు చేసిన మాదిరిగానే కుండను చేయడం కనిపిస్తోంది. ఈ వీడియోను (Cat Making Pottery Video) చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో పిల్లి రియాక్షన్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్  చేయడంతో పాటు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Elephant Video: నది దాటుతూ...ప్రవాహంలో కొట్టుకుపోయిన పిల్ల ఏనుగు..తరువాత ఏమైంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook