Trending Video: 9 మూతలు 8 అయ్యాయి.. 9=8?? 99% మంది ఫెయిల్ అయ్యారు.. ట్రై చేయండి!
Trending Video: జీవితంలో మన కళ్లను మనం నమ్మలేనంతగా కొన్ని సంఘటను జరుగుతుంటాయి. మన కళ్ల ఎదుట జరిగే విషయం కూడా నిజమో కాదో తెలుసుకునేందుకు తదేకంగా పరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ట్రిక్ తో ఓ ట్రిక్కీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే దాని కిటుకు ఏంటో కనిపెట్టడంలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మీరైనా ఒకసారి దాని కిటుకు ఏంటో తెలుసుకోండి.
Trending Video: ప్రతి క్లాస్ లో టీచర్ అడిగే ప్రశ్నలకు అందరి కంటే ముందుగా అన్సర్ చెప్పాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఉపాధ్యాయులు కూడా ఆ విద్యార్థులపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. అయితే అలాంటి తెలివైన విద్యార్థులు అన్నిసార్లు సరైన సమాధానం చెబుతారనే గ్యారెంటీ లేదు. తెలివైన విద్యార్థికి తెలియని కొన్ని ఆన్సర్స్, ట్రిక్స్ బ్యాక్ బెంచర్ కు తెలుస్తాయి. అలాంటి కొన్ని ట్రిక్స్ ఉపయోగించి కష్టమైన గణిత పాఠాలను కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలూ తరచూ మనం ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటాం. అలాంటి ట్రిక్ కశ్చన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ గా మారుతున్నాయి. కొన్ని సెకన్ల వీడియోలు కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ట్రిక్కీ వీడియో చూస్తే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయడం ఖాయం. అయితే ఆ ట్రిక్ ఎలా జరిగిందనే విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనలో చాలామంది శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఆ బాటిల్స్ కు సంబంధించిన మూతలను తీసుకొని చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటుంటారు. వాటిని ఉపయోగించి.. ఓ వ్యక్తి వీడియో ట్రిక్ చేశాడు. అది ఇప్పుడు గూగుల్ ట్రెండ్ అవుతుంది.
వీడియో ప్రకారం.. కెమెరా ముందు ఉన్న టేబుల్ పై మొత్తం తొమ్మిది శీతల పానీయ బాటిల్ కు సంబంధించిన మూతలు ఉన్నాయి. వాటిని ఒకదానితో ఒకటిగా వాటిని దగ్గర చేర్చారు. అలా 9 మూతలను రెండు భాగాలుగా అంటే నాలుగు, నాలుగుగా విడదీశారు. అయితే మిగిలిన తొమ్మిదో మూత ఎక్కడికి పోయిందని అనే విషయం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఒక్క మూత ఎలా అదృశ్యమైందో ఎవరికీ అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకునేందుకు ఆ వీడియోను చాలా సార్లు తప్పక చూస్తారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడుతారు. అయితే ఆ ట్రిక్ ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ ట్రిక్ రహస్యం!
వీడియో ప్రారంభంలో మీకు 9 మూతలు కనిపిస్తాయి. కానీ, కర్రతో అన్నింటిని ఒక చోట చేర్చిన తర్వాత అందులో ఒకటి అదృశ్యం అవుతుంది. చివరికి 8 మూతలే మిగిలి ఉంటాయి. అయితే ఆ గుంపులోని మధ్య స్థానంలో ఉన్న మూతపై మరొక మూతను కవర్ చేసినట్లుగా వీడియోను ఎడిట్ చేశారు. అందుకే మధ్యలో ఉన్న మూత కొద్దిసేపు తర్వాత మరొకదానిపై కలిసి పోతుంది. దీంతో టేబుల్ పై మొత్తం 8 మూతలే కనిపిస్తాయి. దాదాపు 99 శాతం మంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు.
Also Read: Cycle Stunt Video: ఇది మామూలు స్టంట్ కాదు.. చూస్తే పడి పడి నవ్వుతారు!
Also Read: Flying Car Video: పక్షిలా గాల్లోకి తుర్రున ఎగిరే కారును ఎప్పుడైనా చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook