Kacha Badam Trend: కచ్చా బాదం సాంగ్.. అసలు పరిచయం అక్కర్లేని ట్రెంటింగ్  పాట. పశ్చిమ్ బెంగాల్​కు చెందిన ఓ చిరు వ్యాపారf వేరు శెనగలు అమ్ముకునేందుకు పాడిన ఈ జింగిల్​ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండ్​ అవుతున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణ ప్రజలను మొదలుకుని, సెలెబ్రెటీల వరకూ ఈ పాటకు స్టెప్పులేయడం చూస్తున్నాం. ఈ పాట మాత్రమే కాదు.. దానిని పాడిన వ్యక్తి భూబన్ బద్యాకర్​ కూడా అంతే ఫేమస్​ అయ్యారు. నేరుగా ఆ వ్యక్తిని కలిసి మరి సెలెబ్రెటీలు స్టెప్పులు వేస్తుండటం విశేషం. దీనితో యూట్యూబ్​ సహా ఇతర సామాజిక మాధ్యమాలన్నింటిలో ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఆయితే ఓ చిన్నారి ఈ పాటలకు డ్యాన్స్​ చేసిన వీడియో ఇంటర్నెట్​ను షేక్ చేస్తోంది. సాధారణంగా ఐదేళ్ల చిన్నారులు డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తేనే చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది.. నెపాల్​కు చెందిన ఓ చిన్నారు కచ్చా బాదామ్​ పాటకు.. చక్కటి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంటోంది.


ఆ చిన్నారి డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియో తీస్తున్నప్పుడు పక్కనే ఉన్న వారంతా కేరింతలతో ఆ చిన్నారిని ప్రోత్సహిస్తున్నారు.


ఆ చిన్నారి డ్యాన్స్​కు సంబంధించిన వీడియోను.. గంటా అనే ఇన్​స్టా పేజీలో షేర్ చేశారు. రెండు రోజల క్రితం ఈ వీడియోను షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించారు. 2.62 లక్షల మందికి పైగా ఇన్​స్టా యూజర్లు లైక్​ కొట్టారు.



మరి ఆ చిన్నారి క్యూట్​ క్యూట్ స్టెప్పులను మీరు చూసి ఎంజాయ్ చేయండి.


Also read: Viral Video: ఉక్రెయిన్ వాసుల ప్రేమతో.. భావోద్వేగానికి గురైన రష్యన్ సైనికుడు!


Also read: Samosa Ban: త్రిభుజాకారంలో ఉందని ఆ ప్రాంతంలో సమోసపై నిషేధం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook