Samosa Ban in Somalia: భారతదేశంలో సమోస ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలుసు. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు అల్పాహారంగా సమోసను చాలా సార్లు పెట్టి ఉంటాం. దాదాపుగా మన దేశంలో సమోసను ఇష్టపడని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని చిరుతిండ్లలో సమోసాదే అగ్రస్థానం. అయితే ఒక్క దేశంలో మాత్రం సమోసపై నిషేధం విధించారు. సమోసను ఇకపై తమ ప్రజలు తినకూడదని ప్రభుత్వం అదేశించింది. సమోస నిషేధం ఏంటి? సమోస అంటే ఇష్టం లేని దేశమేంటో తెలుసా?
సమోస నిషేధానికి విచిత్రమైన కారణం
కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. సోమాలియా అనే దేశంలో సమోసపై నిషేధం విధించారు. అయితే సమోసను నిషేధించడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని ఆ దేశ ప్రజలు చెబుతున్నారు. దాని ఆకారం కారణంగా దానిపై నిషేధం విధించినట్లు తెలిపారు. సోమాలియా దేశంలోని ఓ మతానికి సంబంధించిన త్రిభుజాకార రూపం ఉండడం వల్ల.. ఆ చిహ్నాన్ని పవిత్రంగా భావిస్తున్న ప్రజలు త్రిభుజాకార సమోసాలపై నిషేధం విధించారు.
తమ దేశానికి చెందిన ప్రజలు సమోసాలను తయారు చేసి విక్రయిచడం కానీ.. వాటిని తినడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. దాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు.
సమోస స్పెషల్
సమోస.. దక్షిణాసియా అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ రుచికరమైన చిరుతిండిని.. గోధుమ పిండి లేదా మైదాతో బంగాళాదుంప మసాలా వేసి తయారు చేస్తారు. ఉత్తర భారతదేశంలో సమోసకు విపరీతమైన క్రేజ్ ఉంది. మన దేశం తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సమోస ప్రాచుర్యం పొందింది. 16వ శతాబ్దపు మొఘల్ శకం పత్రం 'అయిన్నే అక్బరీ'లో కూడా సమోస ప్రస్తావన ఉంది.
Also Read: Earn Money Online: కెమెరా ఆన్ చేసి నిద్రపోయాడు.. కట్ చేస్తే లక్షాధికారి అయ్యాడు!
Also Read: Dog vs Frog Video: కప్ప ధాటికి తోక ముడిచిన శునకం- వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook