Viral Video: ఉక్రెయిన్ వాసుల ప్రేమతో.. భావోద్వేగానికి గురైన రష్యన్ సైనికుడు!

Viral Video: ఉక్రెయిన్​తో యుద్ధం కారణంగా రష్యా సైనికులు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో యుద్ధం చేయలేక ఉక్రెయిన్​ ప్రజల ఎదుట లొంగిపోతున్నారట. ఇలాంటి ఘటనకు సంబంధంచి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 03:21 PM IST
  • ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యా సైనికుల తిప్పలు
  • ఒత్తిడి కారణంగా లొంగిపోతున్న వైనం
  • వైరల్ అవుతున్న సైనికుల వీడియోలు..!
Viral Video: ఉక్రెయిన్ వాసుల ప్రేమతో.. భావోద్వేగానికి గురైన రష్యన్ సైనికుడు!

Viral Video: రష్యా ఉక్రెయిన్ వద్ద యుద్ధం 8వ రోజుకు చేరింది. ఉక్రెయిన్​లోని ప్రధాన నగరాలపై బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్​లోని వివిధ ప్రాంతాల్లో రష్యా సైనికులు ప్రత్యక్షంగా చేరి యుద్ధం చేస్తున్నారు.

అయితే యుద్ధంలో ఒత్తిడి కారణంగా సైనికులు పోరాటం చేయలేక.. ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా సైనికులు తమ వాహనాలను తామే ధ్వంసం చేసి ఉక్రెయినీయుల ఎదుట లొంగిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సైనికులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారనేది ఆ వార్తల సారాశం.

తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్​లో అవుతోంది. ఆ వీడియోలో రష్యన్ సైనికుడు భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది.

వీడియోలో ఇంకా ఏముంటంటే..

యుద్ధం కారణంగా కనీస సౌకర్యాలకు నోచుకోని ఓ సైనికుడు ఉక్రెయిన్ ప్రజల ఎదుట లొంగిపోయాడు. ఆ వ్యక్తి చుట్టు ఉక్రెయిన్​ వాసులు ఉన్నారు. ఆ సైనికుకిడికి తినడానికి ఆహారంతో పాటు.. టీ ఇచ్చి తమలో ఒకడిగా చూసుకుంటున్నారు. తమ దేశంపై దాడి చేసేందుకు వచ్చినా.. తమ ఎదుట లొంగిపోయిన అతడి అవస్థను చూసి సహాయం చేశారు.

మరో యువతి అతడి ఇంటికి వీడియో కాల్​ చేసి.. బాగోగుల గురించి చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్​ వాసులు తనపై చూయించిన ప్రేమకు, ఫోన్లో తల్లితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను Christopher Miller అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా చూశారు. 22 వేల మందికి పైగా లైక్​ చేశారు.

Also read: Peacock vs Goat Viral Video: మేకపోతుకు చుక్కలు చూపించిన నెమలి.. వైరల్ వీడియో

Also read: Srivalli Comedy Video: నాటకం మధ్యలో శ్రీవల్లి పాట.. నాటకం ఆపేసి స్టెప్పేసిన ఆర్టిస్ట్.. నవ్వులే నవ్వులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News