Twitter new feature: ప్రఖ్యాత సోషల్ మీడియా , మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఫోటోలు, వీడియోలు, మీడియా షేరింగ్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(Twitter )‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. కొత్త అప్‌డేట్ (Twitter new update) అందుబాటులో వచ్చిన తరువాత ఇకపై ట్విట్టర్‌లో వినియోగదారులు 4కే రిజల్యూషన్ ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. హై రిజల్యూషన్ వీడియోల్ని కూడా వీక్షించవచ్చు. ఇందుకు అనుగుణంగా ట్విట్టర్..ఫోటోలు, వీడియోలు, మీడియా షేరింగ్‌లో మార్పులు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ ట్విట్టర్‌లో హై రిజల్యూషన్ ఫోటోలను అప్‌లోడ్ చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే కొంతమంది కస్టమర్లకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆప్షన్ కనిపిస్తే.. దాన్ని యూజర్లు టెస్ట్ చేయవచ్చు. ఇందుకు సెట్టింగ్స్ విభాగంలో కనిపించే హై క్వాలిటీ ఇమేజెస్ ప్రిఫరెన్సెస్‌‌కు మార్చుకోవాలి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగంలో డేటా యూసేజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే కొత్త ఫీచర్(Twitter new features) కనిపిస్తుంది. సాధారణంగా హై క్వాలిటీ ఇమేజెస్ అప్‌లోడ్ సెట్టింగ్స్ డిఫాల్ట్‌గా నెవర్ అని చూపిస్తుంది. దీన్ని యూజర్లు మ్యాన్యువల్‌ రూపంలో మార్చుకోవాలి. అంటే కస్టమర్లు తమ ప్రాధాన్యాన్ని బట్టి అప్‌లోడ్ చేసే ఇమేజ్‌లను డిఫాల్ట్‌గా లేదా హై రిజల్యూషన్ ఇమేజ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు.


కొత్త అప్‌డేట్ అందుబాటులో వచ్చిన తరువాత సింగిల్ ఇమేజ్‌ను ట్వీట్ చేసినప్పుడు..అది టైమ్‌లైన్లో కనిపించినట్టుగానే ట్వీట్ కంపోజర్లో కూడా కనిపిస్తుంది. సైజు కూడా పెద్దదిగా, మెరుగ్గా ఉంటుంది. కొంతమంది ట్వీట్‌తో పాటు స్టాండర్డ్ యాస్పెక్ట్ రేషియోతో ఉండే సింగిల్ ఇమేజ్‌ను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తారు. మరోవైపు యూజర్లు సెండ్ బటన్‌ను నొక్కిన తరువాత కూడా ట్వీట్‌ పోస్ట్ చేసే విషయంలో పునరాలోచించే అవకాశాన్ని ట్విట్టర్ కల్పించనుంది. దీనికి సంబంధించిన Undo ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. దీని ద్వారా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేయడానికి ముందు ఒక ట్వీట్‌ను వెనక్కి తీసుకోవడానికి లేదా సరి చేయడానికి అవకాశం కలుగుతుంది. ట్వీట్ బటన్‌ను నొక్కిన తరువాత కంటెంట్ కింద బ్లూ కలర్లో  Undo అనే ఆప్షన్ కనిపిస్తుంది. ట్వీట్ పోస్ట్ కావడానికి కొన్ని సెకన్లకు ముందు ఈ బటన్‌పై నొక్కి ట్వీట్‌ను వెనక్కు తీసుకోవచ్చు.


Also read: PUBG Relaunch: మీకిష్టమైన PUBG Relaunch ఎప్పుడో తెలుసా..పబ్ జీ ప్రేమికులకు గుడ్‌న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook