Viral Snakes Videos: మీరు ఎప్పుడైనా నాగు పాములు డాన్స్ చేయడం చూశారా ? నాగు పాము అంటే గుర్తుకొచ్చింది .. చాలామంది నిజంగా నాగు పాములు నృత్యం చేయడాన్ని చూడొచ్చు .. లేదా చూడకపోవచ్చు .. ఎందుకంటే అందరికీ అలాంటి దృశ్యం కంటపడే అవకాశం ఉండదు కదా .. కానీ నాగిన్ డాన్స్ మాత్రం ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా సినిమాల్లోనో లేక టీవీల్లోనో చూసే ఉంటారు కదా.. ఆ నాగిన్ డాన్స్ చూసినప్పుడల్లా చాలామందిలో కలిగే సందేహం ఏంటంటే... నిజంగా నాగు పాములు కూడా ఇలాగే నృత్యం చేస్తాయా లేక మనుషులే తమకు తోచినట్టుగా డాన్స్ చేసి దానికి నాగిని డాన్స్ అని పేరు పెట్టుకున్నారా అనే సందేహం రాకమానదు. అలాంటి సందేహం ఉన్న వాళ్లందరి అనుమానాలను నివృత్తి చేసేలా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక వ్యవసాయ బావి వద్ద పంట పొలాల సమీపంలో షూట్ చేసినట్టుగా కనిపిస్తున్న ఈ వీడియో చూస్తోంటే.. రెండు నాగు పాములు ఆదమరిచి నృత్యం చేస్తూ కనిపిస్తున్నాయి. ఈ రెండు నాగు పాములు ఇలా డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని అక్కడికి సమీపంలోనే కట్టేసి ఉన్న గేదె కూడా అలాగే చూస్తూ ఉంది. ఒకే ఫ్రేములో రెండు నాగు పాములు డాన్స్ చేస్తుండటం.. ఆ వెనుకాలే ఓ గేదె కూడా కనిపిస్తుండటంతో ఈ వీడియోలో ఏం ఉందా అని నెటిజెన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. సోషల్ మీడియాలో



సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. మరీ ప్రత్యేకించి పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వెంటనే వైరల్ అవడాన్ని గమనిస్తే.. నెటిజెన్స్‌కి గానీ లేదా జనానికి పాముల గురించి తెలుసుకోవాలని, అవి ఎలాంటి సందర్భంలో ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకోవాలి అనే ఉత్కంఠ ఎక్కువగానే ఉన్నట్టు అర్థం అవుతోంది.


ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో


యూట్యూబ్ షార్ట్స్ నుండి మొదలుపెడితే.. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఏ సామాజిక మాద్యమంలో చూసినా స్నేక్స్ వైరల్ వీడియోలకు కొదువే లేదు. అందులో కొన్ని సెకన్ల విడివి ఉన్నయితే.. ఇంకొన్ని 10 లేదా 15 నిమిషాలకుపైనే ఉండేవి కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వీటికి వస్తోన్న భారీ స్పందన చూసి చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా లేదా యూట్యూబర్స్‌గా మారి వారు కూడా వారి వారి సొంత వీడియోలు అప్‌లోడ్ చేయడం మొదలుపెడుతున్నారంటే జనంపై వీటి ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా !!


ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి