Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు

Snakes Catchers Catching Giant Black King Cobra: 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు. 

Written by - Pavan | Last Updated : Aug 7, 2023, 10:46 AM IST
Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు

Snakes Catchers Catching Giant Black King Cobra: అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ముకుందాపురంలోని శివారు పొలాల్లో ఓ భారీ గిరి నాగు పాము కలకలం రేపింది. 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

ముకుందాపురం గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న విశాఖపట్నం నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రతినిధి మూర్తి బృందం గిరి నాగు పాము ఉన్న పొలానికి చేరుకున్నారు. ఆ పంట పొలాల చుట్టూ భారీగా చెట్లు పెరిగి ఉండటం, తోటలు ఉండటంతో ఆ నాగు పాము ఎక్కడ దాగుందో కనిపెట్టడం ఒక పెను సవాలుగా మారింది. అయినప్పటికీ గ్రామస్తుల భయాందోళన చూసిన స్నేక్ క్యాచర్స్ గంట సేపు తీవ్రంగా శ్రమించి.. పామును సజీవంగా పట్టుకున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News