Man Beats Two Men For Teasing His Girl Friend: అమ్మాయిలకు భద్రత విషయంలో ఒక్కోసారి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు ఊహించలేం. ఒంటరిగానే కాదు.. పక్కన ఎవరైనా తోడున్నప్పటికీ కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం మాత్రం మానుకోరు. అమ్మాయి కంటపడితే చాలు వారిలోని కోతి వేషాలన్నీ బయటికొస్తాయి. వారిలోని మృగం మేల్కొంటుంది. అలాంటి పిచ్చి వేషాలు వేసి ఒక్కోసారి ఊహించని విధంగా చావు దెబ్బలు కూడా తింటుంటారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక అమ్మాయి, అబ్బాయి తమ దారిన తాము వెళ్తూ ఓ సబ్‌వేలోకి ప్రవేశించారు. అయితే, అప్పటికే ఆ సబ్‌వేలో వారి కోసమే కాపు కాసినట్టుగా ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. అప్పటివరకు గోడకు ఒరిగి నిలబడి ఉన్న ఆ ఇద్దరు యువకులు.. ఈ అమ్మాయిని చూసి టీజ్ చేయబోయారు. వారిలో ఒకడైతే ఏకంగా చేతిలో ఉన్న ఏదో వస్తువును అమ్మాయిపైకి విసిరేశాడు. ఆ యువతికి ఆ వస్తువు తగలడంతో వారు వెనక్కి తిరిగి చూశారు. అయితే ఈ వెదవలతో మనకెందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా ఆమె తన పక్కనే ఉన్న యువకుడిని సముదాయించి ముందుకు తీసుకెళ్లబోయింది.


ఆ యువతీ యువకుల మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న ఆకతాయి కుర్రాడు.. మరోసారి వారి గురించి కామెంట్ చేస్తూ రెచ్చగొట్టాడు. ఆకతాయిల అల్లరితో ఆ యువతి పక్కన ఉన్న వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా వచ్చి తనపై నోరు పారేసుకున్న వ్యక్తిని రెండండే రెండే రెండు పిడి గుద్దులు గుప్పించాడు. అంతే.. ఆ ఆకతాయి వెదవ అలాగే నేలకొరిగాడు. అది చూసి ఆ పక్కనే ఉన్న కుర్రోడు ఊరికే నిలబడడు కదా.. తన స్నేహితుడిని కొడతావా అంటూ అతడిపై ఆవేశంగా యుద్ధానికి వెళ్లాడు. కానీ అప్పటికే పట్టరాని కోపంతో ఉన్న యువతి స్నేహితుడు.. రెండో ఆకతాయి కుర్రోడిని కూడా అదే విధంగా గట్టిగా రెండు పంచ్ లు ఇచ్చాడు. యువకుడి దెబ్బకు సబ్ వే లో చుక్కలు చూసిన ఆ యువకుడు అక్కడే కుప్పకూలాడు. 


ఇది కూడా వీక్షించండి: Tea Seller Washing Tea Cup With Toilet: టీ కప్‌లో మూత్రం పోసిన ఛాయ్ వాలా.. వీడియో వైరల్




అలా మొత్తానికి అమ్మాయి స్నేహితుడి చేతిలో చావు దెబ్బలు తిన్న ఇద్దరు యువకులు కుప్పకూలారు. దీంతో ఆ యువతీ, యువకులు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చూడ్డానికి అచ్చం సినిమాలో ఫైటింగ్ సీన్‌లా ఉన్న ఈ రియల్ సీన్ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. సిసిటివి ఇడియట్స్ పేరిట ఎవరో నెటెజన్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకతాయి వేషాలేస్తే ఎవరో ఒకరు ఇలా చావగొట్టిపోతారు అనే సందేశం ఈ వీడియో చెప్పకనే చెప్పింది. అంతేకాదు.. ఆకతాయి పనులు చేసే వారితో స్నేహం చేస్తే.. ఆ ఆకతాయి పనుల వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఏ సంబంధం లేని వారు కూడా చిక్కుకుంటారని అతడి స్నేహితుడికి ఎదురైన గుణపాఠం చెబుతోంది.  


ఇది కూడా వీక్షించండి: Skateboarder Falls Under Bike: నడిరోడ్డుపై స్కేట్ బోర్డింగ్.. నేరుగా వెళ్లి బైక్ కింద.. OMG వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook