Skateboarder Falls Under Bike: నడిరోడ్డుపై స్కేట్ బోర్డింగ్.. నేరుగా వెళ్లి బైక్ కింద.. OMG వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

Skateboarder Falls Under Bike: రోడ్ సేఫ్టీకి ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా కొంతమంది లైట్ తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసిన తప్పిదాలకు ఎదుటివారు బలవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూస్తే.. స్కేట్‌బోర్డింగ్ చేసే వ్యక్తి ఎంత పెద్ద పొరపాటు చేశాడో మీకే అర్థమవుతుంది. 

Written by - Pavan | Last Updated : Apr 12, 2023, 05:14 PM IST
Skateboarder Falls Under Bike: నడిరోడ్డుపై స్కేట్ బోర్డింగ్.. నేరుగా వెళ్లి బైక్ కింద.. OMG వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది

Skateboarder Falls Under Bike: రోడ్ సేఫ్టీ గురించి కొంతమందికి ఎన్నివిధాల చెప్పినా, ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పినా వారికి ఎంతకీ అర్థం కాదు. రోడ్డు ఏదో తమ ఒక్కరి సొంతం అన్నట్టుగానో లేక రోడ్డు తమ ప్రైవేటు ఆస్తి అన్నట్టుగానో వ్యవహరిస్తుంటారు. పబ్లిగ్గా భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులపైకి వెళ్లినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అన్నింటికి మించి కొంతమందికి తాము చేసిన తప్పిదం వల్ల మరొకరు బలి కాకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.

ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూస్తే అసలు పరిస్థితి ఏంటో మీకే అర్థం అవుతుంది. ఏ పనిని ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగుంటుంది. అలా కాకుండా మరొక చోట చేస్తే కొన్నిసార్లు అవి ఊహించని అనర్ధాలకు కారణం అవుతుంటాయి. ఇప్పుడు చూడబోయే వీడియోలో కూడా అటువంటిదే జరిగింది. వాహనాలు వెళ్తున్న రోడ్డుపై స్కేటింగ్ చేస్తున్న ఓ యువకుడు అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పిస్తూనే స్కేటింగ్ చేసే క్రమంలో అనుకోకుండా ఓ బైక్‌ని ఢీకొన్నాడు. బైక్‌ని ఢీకొన్నాడు అనేకంటే నేరుగా వెళ్లి ఆ బైక్ కిందే పడ్డాడు. స్కేటింగ్ బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో బైక్ అతడిపై నుంచి వెళ్లింది. 

బైక్‌పై లోడ్‌తో వస్తున్న వ్యక్తికి ఎదురుగా స్కేటింగ్ చేస్తూ వచ్చిన వ్యక్తిని తప్పించే వ్యవధి కూడా లేకపోయింది. అందులోనూ బైకర్ ఆ సమయంలో కొండ ప్రాంతంలాంటి ఎత్తును ఎక్కుతుంటంతో అతడు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం లేకపోయింది. బైక్‌ని అదుపు చేసే వ్యవధిలేకపోవడంతో స్కేటర్‌పై నుంచి వెళ్లి అతడు కూడా కిందపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే .. ఈ రోడ్డు ప్రమాదం ఇద్దరికీ ప్రాణంతకమే. 

ఈ వైరల్ వీడియో కూడా వీక్షించండి : Viral Prank Video: రూ. 500 నోటును ఇలా 2 వేల నోటు చేయొచ్చా ? వైరల్ ప్రాంక్ వీడియో

స్కేటింగ్ చేసే యువకుడు కింద పడిన తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అతడి రెండు కాళ్లు బైక్ ముందు చక్రానికి ఇరువైపులా వెళ్లగా.. బైక్ రెండు కాళ్ల మధ్యలోంచే అతడిపైకి ఎక్కింది. ఇలాంటి ప్రమాదం ఇద్దరికీ ప్రాణాంతకమే అని వీడియో చూస్తే అర్థం అవుతోంది. అందుకే రోడ్డుపైకి వెళ్లినప్పుడు రోడ్డు సేఫ్టీని కూడా మర్చిపోవద్దు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ వెళ్తే మనకూ మంచిది.. మనకు ఎదురుగా వచ్చే వారికి కూడా మంచిది. లేదంటే ఇదిగో ఇలాగే లేనిపోని రోడ్డు ప్రమాదాలు జరిగి ఒక్కోసారి విలువైన జీవితమే కోల్పోవాల్సి వస్తుంది.

ఈ వైరల్ వీడియో కూడా వీక్షించండి: Road Accident Viral Video: తమ్మి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నాయ్ రా! వర్షంలో స్కిడ్ అయిన బైక్.. వెనకాలే వేగంగా వచ్చిన ట్రక్కు.. ఏం జరిగింది..?

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x