Currency Notes Rain From Flyover: బెంగళూరులో ఓ వ్యక్తి ప్రవర్తన జనానికి వింతగా కనిపిస్తే.. పోలీసులకు అతడు ఏం చేస్తున్నాడో.. ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక బుర్ర గోక్కునేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. స్కూటర్ పై కరెన్సీ నోట్ల బ్యాగుతో ఫ్లైఓవర్ పైకి చేరుకున్న ఆ వ్యక్తి.. అందులోంచి రూ. 10 నోట్లను తీసి ఫ్లైఓవర్ పై నుంచి కిందకు వెదజల్లడం మొదలుపెట్టాడు. ఫ్లైఓవర్ పైనే రెండు వైపులకు వెళ్తూ రెండు వైపుల నుంచి నోట్ల వర్షం కరుపించడం మొదలుపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నట్టుండి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వచ్చి పడుతుండటంతో తొలుత ఏం జరుగుతుందో అర్థం కాని జనం గందరగోళానికి గురయ్యారు. కానీ వెంటనే తేరుకుని ఆ నోట్లను ఏరుకోవడం మొదలుపెట్టారు. ఫ్లై ఓవర్ కింద చౌరస్తాలో రోడ్డు పక్కనే తమ వాహనాలను నిలిపి కరెన్సీ నోట్లు ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఫ్లైఓవర్ పైన కూడా నోట్లు పడటంతో పైన కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్ పైన కింద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


పై నుంచి ఒక వ్యక్తి నోట్లు వెదజల్లడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని గ్రహించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే అతడు ఆ ట్రాఫిక్ జామ్‌లోంచే తుర్రున జారుకున్నాడు. దీంతో అతడు ఎందుకొచ్చాడు ? ఇలా ముక్కూ మొహం తెలియని జనంపై నోట్లు ఎందుకు వెదజల్లి వెళ్లాడు అనే విషయాలు అర్థం కాక పోలీసులు అయోమయంలో పడ్డారు. 



కొంతమంది స్థానికులు చెబుతున్న దాని ప్రకారం తెలిసింది ఏంటంటే.. అతడు జీవితంపై విరక్తి చెందాడని.. అందుకే ఇలా తన వద్ద మనీని రోడ్లపై వర్షం కురిపించి వెళ్లాడని కొంతమంది చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అతడి ఆచూకీని తెలుసుకునే పనిలో పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి న్యూసెన్స్‌కి కారణమైన అతడిని అరెస్ట్ చేస్తే కానీ అసలు విషయాలు ఏంటి అనేది తెలిసే ఛాన్స్ లేదు. ఏదేమైనా మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇది కూడా చదవండి : Homeless Old Man: బతికున్న వృద్ధుడిని చెత్త ట్రాక్టర్ ఎక్కించిన శానిటరి సిబ్బంది


ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం


ఇది కూడా చదవండి : Engagement Viral Video: ఓసినీ పాసుగలా.. ఇదా మీ రింగులో యవ్వారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook