UP Constable ask leave to ASP after His Wife Not Lifting Phone Call: స్కూల్ బంక్ కొట్టేందుకు తల్లిదండ్రులకు విద్యార్థులు పలు కారణాలు చెబుతారన్న విషయం మనకు తెలిసిందే. తల నొస్తుందని, కడుపు నొస్తుందని, జ్వరం వచ్చిందని రకరకాల కారణాలు చెబుతుంటారు. తప్పక సెలవు కావాల్సి వచ్చినపుడు ఉద్యోగస్తులు కూడా పలు రకాల కారణాలు చెప్పి లీవ్ తీసుకుంటారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మినహాయింపు ఏం కాదు. అయితే ఓ పోలీస్ కానిస్టేబుల్ సెలవు కోసం చెప్పిన రీజన్ చాలా ఫన్నీగా ఉంది. తన భార్య అలిగిందని, ఆమెను బ్రతిమిలాడుకోవడానికి సెలవు కావాలని ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల ప్రకారం... గౌరవ్​ చౌదరి అనే వ్యక్తి 2016 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గౌరవ్​ చౌదరి స్వస్థలం యూపీలోని మౌ జిల్లా. ప్రస్తుతం అతడు మహారాజ్​గంజ్​ జిల్లాలోని నౌత్వానా పోలీస్​ స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. కానిస్టేబుల్ గౌరవ్‌కు 2022 డిసెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే తన భార్యను ఇంటి వద్ద వదిలి.. డ్యూటీలో చేరాడు. అప్పటినుంచి గౌరవ్‌కు సెలవులు దొరకలేదు. భార్య ఫోన్ చేస్తే.. లీవ్ దొరకగానే ఇంటికి వస్తా అని చెపుతూ వస్తున్నాడు. సతీమణి గట్టిగా నిలదీయగా.. మేనల్లుడి పుట్టినరోజున తప్పకుండా ఇంటికి వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. 


అయితే మేనల్లుడి పుట్టినరోజున రాకముందే గౌరవ్​ చౌదరి సతీమణి అతడి ఫోన్ కాల్ ఎత్తడం మానేసింది. కాల్ ఎత్తకుండా తన కోపాన్ని ప్రదర్శిస్తుందని కానిస్టేబుల్ గౌరవ్ గ్రహించాడు. ఇక చేసేది లేక ఏడు రోజులు సెలవు కావాలని ఏఎస్పీకి లేఖ అతడు రాశాడు. 'పెళ్లి అయిన మరుసటి రోజే నా భార్యను వదిలి వచ్చాను. నాపై చాలా కోపంగా ఉంది. ఫోన్ కాల్ ఎత్తడం లేదు. మేనల్లుడి పుట్టినరోజున తప్పకుండా ఇంటికి వెళ్లాలి. నాకు ఏడు రోజులు సెలవులు కావాలి' అన్ని ఏఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. 


కానిస్టేబుల్ గౌరవ్​ చౌదరి రాసిన లేఖను ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్ చదివారు. కానిస్టేబుల్​ ఇబ్బంది అర్థం చేసుకొన్న ఏఎస్పీ లీవ్స్ మంజూరు చేశాడు. అయితే కానిస్టేబుల్ గౌరవ్ కోరిన 7 రోజులు కాకుండా.. 5 రోజులు సెలవులు ప్రకటించాడు. రేపటి నుంచి (జనవరి 10) గౌరవ్​ చౌదరి సెలవుపై ఇంటికి వెళ్లనున్నారు. అయితే కానిస్టేబుల్ గౌరవ్​ చౌదరి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖ చూసిన నెటిజన్లు అతడిపై జాలి చూపిస్తున్నారు. 


Also Read: Makar Sankranti 2023: మకర సంక్రాంతి నాడు ఈ వస్తువులు దానం చేస్తే.. ఏడాదంతా అదృష్టమే! డబ్బు వర్షం పక్కా  


Also Read: IND vs SL Holiday: భారత్‌, శ్రీలంక తొలి వన్డే.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం! పండగ చేసుకుంటున్న స్టూడెంట్స్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.