Assam Govt gives Half-Day Holiday for Students in Kamrup-Metro for IND vs SL ODI Match: 2023 ఏడాదిని భారత క్రికెట్ జట్టు గొప్పగా ప్రారంభించింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. సీనియర్లు జట్టులో లేకున్నా.. యువకులు అద్భుతంగా ఆడి టీ20 సిరీస్ గెలిచారు. ఇక మంగళవారం నుంచి (జనవరి 10) భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 సిరీస్ మాదిరే వన్డే సిరీస్ కూడా పట్టేయాలని భారత్ చూస్తోంది. అదే సమయంలో టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లంక భావిస్తోంది.
తొలి వన్డే నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో ఫాన్స్ మ్యాచ్ చూసేందుకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలకు ఈ హాఫ్ డే వర్తించనుందని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. విషయం తెలుసుకున్న అక్కడి స్టూడెంట్స్, ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా మూడు వన్డేలకు దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో బుమ్రాను వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. బుమ్రా చివరిసారిగా 2022 సెప్టెంబరులో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022 లోనూ ఆడలేదు.
వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
Also Read: Rishabh Pant BCCI: బీసీసీఐ మంచి మనసు.. ఐపీఎల్ 2023 ఆడకున్నా రూ.16 కోట్ల చెల్లింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.