Donate These 5 Things on Makar Sankranti 2023 for Good Luck and Money: 2023 జనవరి 15న 'సంక్రాంతి' పండగ. జనవరి 14న మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ రోజును 'మకర సంక్రాంతి' అని కూడా పిలుస్తారు. జనవరి 14న రాత్రి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నప్పటికీ.. పుణ్యకాలంమాత్రం జనవరి 15న ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15న జరుపుకుంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ పండగ చాలా ప్రత్యేకమైంది. కుటుంబసభ్యులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు.
అయితే మకర సంక్రాంతి రోజున తల స్నానం చేసి దానం చేయడం చాలా ముఖ్యమైనది. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు నువ్వులు దానం చేయడం అత్యంత ముఖ్యమైనది. మకర సంక్రాంతి రోజున చేసే దానం వల్ల ఈ జన్మలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలగడమే కాకుండా.. ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. మకర సంక్రాంతి రోజున ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు చూద్దాం.
నువ్వుల దానం:
మకర సంక్రాంతిని 'తిల సంక్రాంతి' అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. శని దోషం తొలగిపోతుంది. సంక్రాంతి రోజున విష్ణువు, సూర్యుడు మరియు శని దేవుడిని కూడా ఆరాధించాలి.
దుప్పటి దానం:
మకర సంక్రాంతి రోజున పేదవాడికి దుప్పటి దానం చేయండి చాలా మంచిది. దీంతో రాహు దోషం తొలగిపోతుంది. సంక్రాంతి రోజున పేద, నిస్సహాయ, పేద ప్రజలకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి.
బెల్లం దానం:
బృహస్పతి గ్రహంతో బెల్లం సంబంధం కలిగి ఉంటుంది. మకర సంక్రాంతి రోజున బెల్లం దానం చేయడం వల్ల మీ జాతకంలో బృహస్పతి గ్రహం బలపడుతుంది. దాంతో జీవితంలో అదృష్టం, ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.
కిచిడి దానం:
మకర సంక్రాంతి రోజున కిచిడి తయారు చేయడం చాలా ముఖ్యం. అందుకే దీనిని 'కిచిడి పండుగ' అని కూడా అంటారు. బియ్యం, ఉడకబెట్టిన పప్పు మరియు పచ్చి కూరగాయలు మకర సంక్రాంతి కిచిడిలో ఉపయోగిస్తారు. ఈ పదార్థాలు శని, బుధుడు, సూర్యుడు మరియు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రోజున కిచిడి తినడం మరియు దానం చేయడం వల్ల ఈ గ్రహాలన్నిటి అనుగ్రహం లభిస్తుంది.
నెయ్యి దానం:
మకర సంక్రాంతి రోజున నెయ్యి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సూర్యుడు మరియు బృహస్పతితో నెయ్యి సంబంధం కలిగి ఉంటుంది. నెయ్యి దానం చేయడం వలన జాతకంలో సూర్యుడు మరియు బృహస్పతి బలపడతారు. ఈ రెండు గ్రహాలు జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సు మరియు గౌరవాన్ని కలిగిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.