Fatehpur Police Save Monkey: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని (Monkey) కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఓ కానిస్టేబుల్. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కోతి కడుపులో చిక్కుకుని చనిపోయిన చిన్నారి కోతిని బయటకు తీసి..తన ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో (Fatehpur district) చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫతేపూర్ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. 
ఫతేపూర్‌లోని ఖాగాలో చనిపోయిన బిడ్డ కోతి కడుపులో ఇరుక్కుపోయింది. దీంతో డ్రెయిన్‌లో కోతి బాధతో విలవిల్లాడింది. ఆ దృశ్యాన్ని మీరు వీడియోలో  చూడవచ్చు. ఈ విషయం ఫతేపూర్‌లోని ఖాగా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వినోద్ కుమార్ కు తెలిసింది. అక్కడికి వెళ్లిన వినోద్... తన తెలివితో చనిపోయిన బిడ్డను కోతి కడుపు నుండి బయటకు తీశాడు. దీంతో కోతి ప్రాణం నిలబడింది. నొప్పి తగ్గాక వానరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. 



ఈ సంఘటన యొక్క వీడియోను పంచుకుంటూ, ఫతేపూర్ పోలీసులు (Fatehpur Police) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలా వ్రాశారు, కోతి కడుపులో చనిపోయిన బిడ్డను బయటకు తీయడం ద్వారా కోతికి కొత్త జీవితాన్ని ఇచ్చారు అంటూ   కానిస్టేబుల్ వినోద్ కుమార్ ను పొగిడారు.  ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆ పోలీసుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Also Read: Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook