3 Dogs Engage In Fierce Battle With Snake: మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. కానీ కొన్ని సార్లు పాములు దారి తప్పి జనావాసాలకు వస్తుంటాయి. అడవికి దగ్గరగా ఇళ్లలో,  చెట్లు ఎక్కువగా ఉన్న చోట పాములు కన్పిస్తుంటాయి.  చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుతుంటారు. కుక్కలు ఎంతో విశ్వాసంతో ఉంటాయి. తమ యజమాని ఇంట్లో కొత్తగా ఎవరైన వస్తే దాడులకు పాల్పడుతుంటాయి. అదే విధంగా ఇంటికి ఏ పురుగొచ్చిన, కోతులు వచ్చిన, వెంటనే పసిగట్టేస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అదే విధంగా ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల గ్రామసింహలు (కుక్కలు) ఉంటాయి. ఇవి కూడా తమ వీధిలో తమదే రాజ్యమన్నట్లు ఉంటాయి. వేరే చోట ఉండే కుక్కలు తమ వీధిలోకి వస్తే అస్సలు ఊరుకోవు. వెంటనే వాటిపైన దాడిచేస్తాయి. అదే విధంగా కొత్త మనుషులు ఎవరైన కన్పిస్తే, అనుమానంగా ఉంటే వెంటనే అరుస్తూ అందరిని అలర్ట్ చేస్తాయి. కొన్నిసార్లు పాములు, జనవాసాల్లోకి వచ్చినప్పుడు పాములు రౌండప్ చేసి అరుస్తు దాడులు చేసిన అనేక ఘటనలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు.. పాముల దాడిలో కుక్కలు మరణిస్తే, మరికొన్నిసార్లు కుక్కల దాడిలో పాములు చనిపోయిన ఘటనలు కూడా వైరల్ గా మారాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు.. 


ఉత్తర ప్రదేశ్ లోని శ్రావస్తి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రావస్తి గ్రామంలోని ఇకౌనా ప్రాంతంలో పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. గ్రామంలోని ఒక వీధిలో  శునకాలు.. పామును గుర్తించినట్లు వీడియోలో చూడవచ్చు.


Read More: Sleeping After Midnight: ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది


మూడు వీధి శునకాలు పాము మీదకు అరుస్తు వెళ్లాయి. అదేవిధంగా పాము కూడా తన పడగ విప్పి కుక్కలను బుసలు కొడుతూ బెదిరిస్తుంది. ఈ క్రమంలో పాముకు భయపడి శునకాలే కాస్తంత దూరంగా వెళ్లినట్లు కన్పిస్తుంది. కుక్కలు అరుస్తుండటంతో అక్కడి వారంతా అలర్ట్ అయ్యారు. పాము భయంతో ఒక మూలన వెళ్లినట్లు కన్పిస్తుంది. అక్కడున్న యువకులు తమ ఫోన్ లలో ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook