Sleeping After Midnight: ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది

Sleeping After Midnight Effects: మంచి ఆరోగ్యం కోసం సుఖమైన నిద్ర చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎనిమిది గంటల పాటు ద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  కానీ  చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 10:10 PM IST
Sleeping After Midnight: ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది

Sleeping After Midnight Effects: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీని కారణం పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మనిషి శరీరానికి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం. మీరు కానీ సరిగా నిద్రపోలేదంటే  దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల హాని కలుగుతుంది. 

ప్రతిరోజూ రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే ఆందోళన , డిప్రెషన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఆలస్యంగా  నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మీరు మీ పనులను కూడా సరిగా చేసుకోలేకపోతారు.  ఆరోగ్య నిపుణులు ప్రకారం నిద్రపోకపోవడం వల్ల హార్మోన్ క్రమబద్ధీకరణ, జీవక్రియ ఆటంకాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. 

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.  అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది.  

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక బరువు కూడా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఒత్తిడి సమస్య బారిన పడుతారు. దీని కారణంగా ఆందోళన, డిప్రెషన్,  బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. 

సరిగా నిద్రపోవాలి అంటే నిద్ర షెడ్యూల్‌ను తయారు చేసుకోవడం చాలా మంచిది. మీరు దీని కోసం గడియారం కూడా ఉపయోగించవచ్చు. అప్పుడు సరిగా నిద్రపోతారు. నిద్రకు ముందు పాలు, నీళ్లు తాగుతే చాలా మంచిదని  ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also Read  Menthulu Water For Weight Loss: 5 రోజుల్లో మెంతుల నీటితో బరువు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా?

మీరు భోజనం చేసిన తర్వాత చిరుతిళ్లు, స్వీట్లు తీసుకోకుండా ఉండాలి.  అలాగే మంచి దిండ్లు, బెడ్‌ రూమ్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నీద్రకు ముందుగా మీ పనులను పూర్తిగా చేసుకోండి. ఎలాంటి ఆందోళ, ఒత్తిడిని ఆలోచించకుండా ఉండాలి. మీరు ఒత్తిడి, ఆందోళనతో పడుకుంటే శరీరం నీరసంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు చేయకుండా పడుకోవడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది.

Also Read Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్‌ !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News