Police Reverse Gear Chasing In Ghaziabad: నేరాలను చేసిన వారు సీక్రెట్ గా తప్పించుకొవాలని ప్లాన్ లు చేస్తుంటారు . కానీ కొన్నిసార్లు పోలీసులు లాస్ట్ లో కాకుండా.. నేరం జరగ్గానే వెనుకే ఉంటూ ఛేజింగ్ లు చేస్తుంటారు. ఇలా పోలీసులు, కేటుగాళ్లను ఛేజింగ్ చేసి ముప్పు తిప్పలు పెడుతుంటారు. కానీ కొన్నిసార్లు... మాత్రం వీరు పోలీసులకు షాకింగ్ ఇస్తుంటారు. సినిమాలలో ఛేజింగ్ లు చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బాలీవుడ్ సినిమాల్లో ఛేజింగ్ సీన్ లు తప్పకుండా ఉంటాయి. తెలుగులో కూడా పుష్ప ఫెమ్ అల్లు అర్జున్ నటించిన జులాయి మూవీలో ఇలాంటి సీన్ ఉంది.   ఇలాంటి కోవకు చెందిన మరో ఛేజింగ్ సీన్  ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హైవేపై పోలీసులు ఒక కారుముందు వైపు నుంచి వచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఆ కారులో కొందరు తాగి వెహికిల్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారి కారుకు ఎదురుగా జీపును పొనిచ్చి ఆపాలని సూచించారు.


కానీ వారు మాత్రం.. కారును ఆపకుండానే రివర్స్ గేర్ లో దాదాపు.. అర కిలోమీటర్ వరకు పోనిచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా  I-20 కారును నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆకారు ముందు నుంచి వచ్చి, కారును ఆపడానికి ప్రయత్నించారు.


ఆ కారులో ఉన్న వాళ్లు మాత్రం.. రివర్స్ గేర్‌లో ఐ-20 కారును నడుపుతూ అక్కడి నుండి తప్పించుకున్నాడు. పోలీసులు..  కారును వెంబడిస్తున్న షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది. పోలీసులు వాహనాన్ని బాలీవుడ్ సినిమా స్టైల్‌లో వెంబడిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


సంఘటన గురించి..


ఈ వీడియో బుధవారం (ఫిబ్రవరి 21) సోషల్ మీడియాలో కనిపించింది.  ఘజియాబాద్ పోలీసులు హైవేపై కారును వెంబడించడం,  కారు డ్రైవర్ తన కారును రివర్స్ డైరెక్షన్‌లో నడుపుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.


హైవేపై పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కారు డ్రైవర్ కారు ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో, అతను తన కారును హైవేపై రివర్స్ డైరెక్షన్‌లో నడపడం ప్రారంభించాడు, ఆ తర్వాత పోలీసులు తమ బొలెరోలో కారును వెంబడించడం ప్రారంభించారు.


Read more: Manchu Lakshmi: రోజురోజుకు అందాల హద్దులు చెరిపేస్తున్న మంచు లక్ష్మి, లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్


కొద్దిదూరం ఛేజింగ్ చేసిన తర్వాత పోలీసుల నుంచి అతను తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర వాహనాలకు ప్రమాదం జరగొచ్చని పోలీసులు కాస్త జాగ్రత్తగా ఛేజింగ్ చేసినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కారు ఓనర్ వివరాలు సేకరించామని తొందరలనే డ్రైవింగ్ చేసిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వివరణ ఇచ్చారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook