Mrinali Kiran recreates Pushpa Dance: అల్లు అర్జున్ పుష్ప మేనియా జనాలను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాను పుష్ప ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా పుష్ప డైలాగ్స్, మేనరిజమ్స్, స్టెప్పులే కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది పుష్పకి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన మృణాలి కిరణ్ అనే డ్యాన్సర్ అచ్చు అల్లు అర్జున్ లాగే స్టెప్పులేసి అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను మృణాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాలోని 'సామి.. సామి..' పాటకు అచ్చు అల్లు అర్జున్ లాగే కాస్టూమ్స్ ధరించి.. అదే తరహాలో స్టెప్పులేసింది మృణాలిని. అదే ఎనర్జీ, అదే స్టైల్లో అల్లు అర్జున్‌కు ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ చేసింది. 'అల్లు అర్జున్ సార్ డ్యాన్స్ రీక్రియేషన్' పేరిట మృణాలి ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకూ 23వేల పైచిలుకు మంది వీక్షించారు.



మృణాలి పుష్ప (Pushpa Movie) డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 'మీ డెడికేషన్‌కి నమస్కారమండీ..' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'టాప్ రేంజ్ పెర్ఫామెన్స్... మృణాలి అంటే డ్యాన్సర్ కాదు.. క్రాకర్..' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి మృణాలి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే మృణాలి గతంలోనూ అల్లు అర్జున్‌ పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. అప్పట్లో 'డీజే' సినిమాలోని 'గుడిలో బడిలో మదిలో' పాటకు అల్లు అర్జున్ స్టెప్పులను రీక్రియేట్ చేసి అందరి దృష్టిలో పడింది. 


Also Read: Balakrishna on Hindupur District: హిందూపురం కోసం ఎమ్మెల్యే పదవికైనా రాజీనామా చేస్తా : బాలకృష్ణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook