7-Feet Crocodile Viral Today: స్కూల్ టాయిలెట్‌లో భారీ మెుసలి కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్ జిల్లాలోని నాగ్లా పాసి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో ఏడు అడుగుల పొడవైన మెుసలి కనిపించడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. వారు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వన్యప్రాణి సంరక్షణ బృందాలు మరియు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని రెండు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ జరిపి మెుసలిని సురక్షితంగా పట్టుకున్నారు. దానిని బోనులో బంధించి కెనాల్ లో విడిచిపెట్టారు. ఇది సమీపంలోని చెరువులో నుంచి స్కూల్ లోపలకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్రానా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేంద్ర కుమార్ సస్వత్ మాట్లాడుతూ.. "భవనం యజమాని నుండి కాల్ అందుకున్న వెంటనే, మా బృందంతో మేము వెంటనే అక్కడికి చేరుకున్నాం. జంతువులను రక్షించడంలో నైపుణ్యమున్న వైల్డ్ లైఫ్ అధికారులకు కూడా తెలియజేశాం. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. మేము మొసలిని మంచి నీటిలో వదిలాం" అంటూ ఆయన చెప్పారు.  "ఒక నెల వ్యవధిలో ఇదే ప్రాంతం నుండి మొసలిని పట్టుకోవడం ఇది రెండోసారి రెండవది. సమీపంలో దిగువ గంగా కాలువ ఉండటం వల్ల.. మొసళ్ళు కొన్నిసార్లు ఆ నీటి ప్రాంతం నుండి తప్పిపోయి ల్యాండ్ మీదకి వస్తున్నాయని కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బైజు రాజ్ తెలిపారు.


Also Read: Tea Seller Washing Tea Cup With Toilet: టీ కప్‌లో మూత్రం పోసిన ఛాయ్ వాలా.. వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook