Dogs Poops On Anchors Desk In Bolivia Goes Viral: మనలో చాలా మంది కుక్క పిల్లలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొందరైతే మనుషుల కన్నా నోరులేని జీవాలే గొప్పవని భావిస్తారు. అందుకే కుక్క పిల్లలను ఇష్టంతో పెంచుకుంటారు. వీటిని అచ్చం ఇళ్లలోని మనుషుల మాదిరిగా ట్రీట్ చేస్తారు. ప్రతిరోజు మంచి ఫుడ్ ఇస్తారు. వెటర్నరీ డాగ్ ల వద్దకు తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా.. కొందరు కుక్కల కోసం ప్రత్యేకంగా ఇంట్లో గదులను కూడా కట్టిస్తారు. బెడ్, ఫుడ్ లతో పాటు ప్రతిరోజు వాకింగ్ తీసుకెళ్తారు. కుక్కలు కూడా మనుషుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. కొత్త వాళ్లు ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..


ఒకవేళ ఇంట్లో ఎవరైన కొత్త వాళ్లు వస్తే వెంటనే గట్టిగా అరుస్తు కరిచేస్తాయి. అంతే కాకుండా..తమ ఇంట్లోవారిని అలర్ట్ చేస్తుంటాయి. అందుకే ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేని వారు.. లేదా ఒంటరితనంతో ఫీల్ అయ్యే వారు కుక్కలను ఎక్కువగా పెంచుకుంటారు. కుక్కలను పెంచుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చని కూడా నిపుణులుచెబుతుంటారు. ఒంటరితనం, మానసిర ఒత్తిడి, టెన్షన్ , ఊబకాయం వంటి సమస్యల నుంచి కూడా బైటపడోచ్చంట.అందుకే చాలా మంది రోడ్డుమీద ఉండే కుక్కలను కూడా పెంచుకొవాలని అవగాహన కల్పిస్తుంటారు. అంతేకాకుండా.. కుక్కలను దత్తతను ప్రొత్సహిస్తుంటారు. ఇలాంటి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న ఒక టీవీ యాంకర్ ఊహించని ఘటన ఎదురైంది.


పూర్తి వివరాలు..


బొలివియాలో కొన్నిరోజులుగా వీధుల్లో విపరీతంగా కుక్కలు ఆకలికి అలమటిస్తున్నాయి. తినడానికి సరైన ఫుడ్ దొరక్క కుక్కలు చనిపోయి రోడ్ల మీదు కన్నిస్తున్నాయి. మరికొన్ని కుక్క పిల్లలు వాహనాలు ఢీకొనడం వల్ల మరణిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వీధికుక్కలను దత్తత తీసుకొవాలని ఒక టీవీషో కార్యక్రమం లైవ్ ప్రసారం నిర్వహిస్తుంది. దానిలో యాంకర్ కుక్కలను దత్తత తీసుకుంటే ఎలాంటి విధంగా మనం జంతువులకు మేలుచేసిన వాళ్లమౌతాం. అదే విధంగా కుక్క పిల్లలను, ఎలా పెంచుకొవాలి అనేదానిపై లైవ్ లో కుక్కపిల్లలను స్టేజీ మీద పెట్టుకుని మరీ యాంకర్ అవగాహన కల్పిస్తుంది.


Read More: Tigers Turn Sadhus: ఇదేం విడ్డూరం.. శనివారం ఆ జూలో పులులు మాంసం ముట్టుకోవు.. కారణం ఏంటంటే..?


ఇదిలా ఉండగా.. ఒక్కసారిగా కుక్క పిల్ల లైవ్ లోనే టెబుల్ మీద మల విసర్జన చేసింది. దీంతో యాంకర్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఊహించని ఈ ఘటనతో ఆమె నోట మాట రాలేదు. వెంటనే తెరుకుని టిష్యూపేపర్ కోసం అక్కడ వెతికింది. కానీ లైవ్ కావడంతో ఈ ఘటన ప్రసారం జరిగిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజర్లు వామ్మో.. ఇదేం ట్విస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. మీ యాంకరింగ్ అలా ఉందేమో అని కుక్క పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటూ నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్లు పెడుతున్నారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook