Honedy Bees Attack in Madhya Pradesh Wedding: మనలో ప్రతిఒక్కరు పెళ్లి వేడుక మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. లైఫ్ లో ఎప్పటికి గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకొవాలని ప్లాన్ లు చేస్తారు. ఎంత ఖర్చు అయిన కూడా అస్సలు వెనుకాడరు. వెడ్డింగ్ కోసం ఈవెంట్ మెనెజర్ లను  కలిసి వెరైటీగా పెళ్లిని ప్లాన్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు పెళ్లి వేడుకలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో  అప్పటి వరకు ఉన్న సంబరం, సందడి కాస్త విషాదంగా మారిపోతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఈ షాకింగ్ ఘటనలకు షాక్ అవుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Mint Coriander Juice: ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రోగాలు మాయం కావ‌ల్సిందే..!


మధ్య ప్రదేశ్ లో పెళ్లిలో జరిగిన షాకింగ్ ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా కస్తూరి గార్డెన్ హోటల్ లో ఒక పెళ్లి వేడుకను ఏర్పాటు చేశారు. పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు జరిగిపోయాయి. అతిథులు కూడా వస్తున్నారు. ఒక వైపు పెళ్లివేడుక, మరోవైపు క్యాటరింగ్, డీజే పాటలు, ఇలా వెడ్డింగ్ ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. అయితే.. అప్పుడు ఒక ఊహించని ఘటన జరిగింది. అక్కడ చెట్ల నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున తేనెటీగలు లేచాయి. ఆ గార్డెన్ లో ఉన్న వారిపై దాడిచేశాయి. 


పెళ్లికి వచ్చిన అతిథులందరిపై తేనెటీగలు గుంపులుగా దాడిచేశాయి. దీంతో అతిథులంతా తలో దిక్కున పరుగులు పెట్టారు. కొందరు గదుల్లో, సోఫాల కింద, ముఖంను తేనెటీగలు కుట్టకుండా మరికొందరు దాచుకున్నారు. పెళ్లి వేడుక కాస్త .. ఈ ఘటనతో గందర గోళంగా మారిపోయింది. దాదాపు.. 12 మంది అతిథులు తీవ్రంగా  గాయపడ్డారని సమాచారం. 


Read More: Rithu Chowdary: కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రీతూ చౌదరి రీల్స్‌..సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌!


స్థానిక అధికారులు, అత్యవసర  సిబ్బంది పరిస్థితిపై వెంటనే స్పందించారు. ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి ప్రాథమిక చికిత్స చేశారు. బాగా  గాయపడిన వారిని వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో వేడుకగా జరగాల్సిన పెళ్లి కాస్త.. కళ తప్పి బోసిపోయింది. ప్రస్తుతంఈ ఘటన వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook