Bees Viral News: తేనెటీగల్ని చూసి మనుషులు నేర్చుకోవాలట, వైరల్ అవుతున్న టీమ్ వర్క్ థీమ్
ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి.
కలసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి. ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది.
బ్రెజిల్‌లోని సావోపాలోలో తీసిన వీడియోను నెదర్లాండ్‌కు చెందిన శాండర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రెగ్యూలర్‌గా పాజిటివ్ వీడియోలు పోస్ట్ చేయడం అలవాటు అని ప్రొఫైల్ చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియో వైరల్ అయిన తరువాత అనివార్య కారణాలలో ఆ వ్యక్తి తేనెటీగల వీడియో ట్వీట్‌ను డిలీట్ చేశారు. రెండు తేనెటీగలు ఓ బాటిల్ మీద వాలాయి. ఫాంటా సోడా బాటిల్ మూత తీసేందుకు ఆ తేనెటీగలు చేసిన ప్రయత్నం (Viral Video) నెటిజన్లను కదిలిస్తోంది. కలసికట్టుగా తిప్పి మూతను తెరవడం గమనార్హం.
Also Read: Variety Marriage: పెళ్లి కోసం ఛార్టెట్ ఫ్లైట్ బుకింగ్, చిక్కుల్లో నవ దంపతులు, బంధువులు
జంతువులు, పక్షులు, కీటకాలను చూసి మనుషులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ తేనెటీగలు నిరూపించాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాటి చిన్ని మెదడుకు పదునుపెట్టి ఫలితాలు సాధిస్తే, మనుషులు మాత్రం స్వార్థంలో ఆలోచిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. టీమ్ వర్క్ ఉండే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. సోడా తాగిన తరువాత ఈ తేనెటీగలు బాటిల్‌కు మూత పెట్టినవా అని ఫన్నీగా కామెంట్ చేసిన వారు సైతం ఉన్నారు. ఫాంటాకు మంచి అడ్వర్‌టైజింగ్ దొరికిందని మరో కోణంలోనూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also Read: Smartphones offers: పాత స్మార్ట్‌ఫోన్ స్థానంలో కొత్తది కొంటున్నారా ? ఇదిగో mobiles offers
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook