Viral Video: పామును చూసినా.. ఆ పేరు విన్న ఒళ్లు ఝల్లు మంటుంది. అలాంటి పాము మన ముందుకు వస్తే బిత్తర పోతాం. కానీ ఓ వ్యక్తి బాత్‌రూమ్‌లో పామును గుర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేమి జరిగిందంటే..


ఓ వ్యక్తి ఫ్రెష్‌ అప్ అయ్యేందుకు రెస్ట్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ ఏదో ఒక శబ్ధం వినిపించింది. కంగరు పడ్డ ఆ వ్యక్తి బాత్‌రూమ్‌ సీటును గమనించాడు. అందులో పొడవైన పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే కంగుతున్న ఆ వ్యక్తి బయటకు పరుగులు తీశాడు. రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన సిబ్బంది పామును పట్టుకున్నారు. బాత్‌రూమ్ సీటు నుంచి దానిని తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించారు.


పామును ఆ వ్యక్తి చూడకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ఎవరైనా అక్కడికి వెళ్లి ఉండే పాము కాటుకు గురయ్యే వాడు. బాత్‌రూమ్ సీటులోకి పాము ఎలా వెళ్లిందన్న దానిపై సిబ్బంది ఆరా తీస్తున్నారు.  ఈవీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో ట్రెడింగ్‌గా మారింది. 



Also read:AP Rain Alert: ఏపీకి తరుముకొస్తున్న వాయు'గండం'..ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..!


Also read:Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook