Viral Video: పెంపుడు జంతువుల్లో పిల్లులు చాలా అల్లరి చేస్తుంటాయి. అవి చేసే అల్లరి పనులు నవ్వును తెప్పిస్తాయి. అయితే పిల్లులు ఇష్టపడేవి పాలు. పాల కోసం పిల్లులు ఏ పనైనా చేస్తాయి. తమకు ఇష్టమైన పాల కోసం ఓ పిల్లి చేసిన చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియోను ఛత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. అందులో ఓ రైతు ఆవు దగ్గర పాలు పితుకుతున్నట్లు ఉంది. అయితే అతని దగ్గరకు ఓ పిల్లి వచ్చి.. తనకు పాలు కావాలని ఆశగా అడుగుతుంది. దాన్ని జాలిగా చూసిన రైతు.. ఆ పిల్లికి పొదుగు నుంచి పాల దారను అందించాడు. అలా రెండు మూడు సార్లు రైతును బతిమలాడుతూ.. పిల్లి పాలు తాగింది. 



ఈ వీడియోకు ఇప్పటి వరకు 12 లక్షల వ్యూస్ లభించాయి. దీంతో పాటు దీనికి 5 వేలకు పైగా రీట్వీట్స్, 28 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ వీడియోలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Tire Blast: భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయిన జేసీబీ టైరు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్


Also Read: Optical Illusion: చెట్టు కొమ్మల్లో 5 జీవులు ఉన్నాయి.. వాటిని కనిపెడితే మీరు జీనియస్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook