female cop kisses woman in Siliguri west Bengal video: ఇటీవల కాలంలో కొంత మంది పోలీసులు వివాదస్పదంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికైన అన్యాయం జరిగితే.. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తారు. అంతే కాకుండా.. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరుతుంటారు. కానీ కొంత మంది పోలీసులు మాత్రం పీఎస్ కు వచ్చిన బాధితుల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. ఫోన్ నంబర్ తీసుకుని లైంగికంగా వేధిస్తుంటారు. తమకోరికల్ని తీర్చాలని, అప్పుడు కేసును పరిష్కరిస్తామని వేధిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఒక వేళ కాదని ఎదురుతిరిగితే అదనపు కేసులు బనాయించడానికి సైతం వెనుకాడరు. కొంత మంది పోలీసులుతోటీ మహిళ సిబ్బందిని సైతం లైంగికంగా వేధించిన ఘటనలు వార్తలలో నిలిచాయి . తాజాగా, ఒక పోలీసులు తప్పతాగి రోడ్డుపైన వెళ్తున్న మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


వెస్ట్ బెంగాల్ లోని సిల్ గురిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పోలీసు అధికారి తానియా రాయ్ తన సిబ్బందితో కలిసి డ్యూటీలో ఉన్నారు. అయితే.. అక్కడ నుంచి కొంతమంది మహిళలు వెళ్తున్నారు. పోలీసు అధికారిణి తాగి ఉన్నట్లు తెలుస్తొంది. ఆమె మహిళలను చూడగానే దగ్గరకు వెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తొంది. పోలీసులు తాగి ఉండటంను సదరు మహిళ ప్రశ్నించినట్లు సమాచారం. అప్పుడు ఆ లేడీ పోలీసు మహిళను తాగి ఉన్నారా.. లేదా చెక్ చేయాలని ఆమె ముఖం దగ్గరకు వెళ్లి  స్మెల్ చూశారు. అంతేకాకుండా.. ఆమెకు ముద్దుపెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.


ఈ క్రమంలో మహిళ ఎదురు తిరగడంతో సదరు లేడీ అధికారిణి తన ప్రయత్నాన్ని మానుకున్నట్లు తెలుస్తొంది. అంతేకాకుండా.. అక్కడున్న వాళ్లంతా పోలీసుల మీదకు ఎదురుతిరిగారు. పోలీసులు అయి ఉండి.. ఈ పనులేంటని ఏకీ పారేసినట్లు సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు. ఒక పోలీసు అయి ఉండి ఈ పనులేంటనీ కూడా ఏకీపారేస్తున్నారు. మరోవైపు  వెస్ట్ బెంగాల్ లో ఇటీవల మహిళల వేధింపులు ఘటనలు ఎక్కువైనట్లు తెలుస్తొంది.


Read more: Viral Video: బాప్‌రే.. దిండులో దూరి బుసలు కొడుతున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..


మమతా సర్కారు మహిళల భద్రతకు పింక్ మొబైల్ వ్యాన్ ను సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో సదరు లేడీ అధికారిణి చేసిన పని మాత్రం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నేత సమిక్ భట్టా చార్య ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. వెంటనే సదరు అధికారిణి మీద డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకొవాలని  కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.