Viral Video, King Cobra Doing Pranayama like Human: యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే అన్నింటిలోకెల్ల 'ప్రాణాయామం' చాలా చాలా ముఖ్యమైనది. ప్రాణాయామం చూడడానికి చాలా ఈజీ అనిపించినా.. ఎంతో క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామం మనిషి శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది కాబట్టి ప్రతిఒక్కరు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మనుషులు ప్రాణాయామం చేయడం సర్వసాధారణమే అయినా.. పాములు చేయడం మాత్రం చాలా వింత. తాజాగా ఇదే జరిగింది. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తూ కెమెరాకు చిక్కింది. అడవిలో ఉన్న కింగ్ కోబ్రా ప్రాణాయామం చేసింది. ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకున్నట్లే.. ఆ పాము కూడా చేసింది. కింగ్ కోబ్రా తన శ్వాసను వేగంగా లోపలికి పీల్చుకుని ఆపై బయటకు వదిలింది. పడగ విప్పి మరీ ఇలా 4-5 సార్లు ప్రాణాయామం చేసింది. ఊపిరి తీసుకున్న సమయంలో ఆ పాము రెండుతలుగా కనబడుతోంది. 


కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తున్న వీడియోను మేఘనా గిరీష్ అనే ట్విట్టర్ యూసర్ పోస్ట్ చేశాడు. 'నిపుణులైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ ఎస్ వరప్రసాద్ అద్భుతమైన వీడియో తీశారు. నాకు ఈ వీడియో వాట్సప్ ద్వారా వచింది' అని పేర్కొన్నాడు. ఈ షాకింగ్ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి లైకుల, షేర్ల వర్షం కురుస్తోంది. 



కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తున్న వీడియోని ఇప్పటివరకు 20 వేలకు పైగా మంది చూశారు. ఈ వీడియో చూస్తే మీకూ గూస్‌బంప్స్‌ రావడం పక్కా. అయితే కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తోందా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అచ్చం యోగా గురువులా కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తుందని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. కింగ్ కోబ్రా ధ్యానంలో ఉందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇతర కింగ్ కోబ్రాలు తన ఆహారంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న కారణంగానే అది కోపంతో ఊగిపోతోంది అని కొంతమంది అంటున్నారు. 


Also Read: Rohit Sharma Birthday: రోహిత్‌ శర్మ బర్త్ డే.. స్పెషల్‌ విషెస్‌ చెప్పిన విరాట్‌ కోహ్లీ!


Also Read: Funny Video: అసలే సమ్మర్, ఆపై విద్యుత్ కోతలు.. ఉక్కపోత తట్టుకోలేక ఈ వ్యక్తి ఏం చేశాడో చుడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook