Man spinning a blade of a Table Fan for keep cool during summer: ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని పలు చోట్ల ఉష్ణోగ్రత దాదాపు ప్రతిరోజూ 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఓవైపు రికార్డు స్థాయిలో ఎండలు కాస్తుంటే.. మరోవైపు వేడి గాలుల తీవ్రత కూడా ఎక్కువైంది. ఇది చాలదన్నట్టు చాలా రాష్ట్రాలోని ప్రజలు విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నారు. దాంతో మధ్యాహ్నం పూట అయితే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
కరెంటు లేకపోవడం, ఎండ వేడిమితో వేసవిలో చల్లగా ఉండేందుకు ప్రజలు చాలా మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తెలివైన ఆలోచన చేశాడు. ఉక్కపోత తట్టుకోలేక తన చేతులతో ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌కు ఉండే రెక్కలను వీలైనంత గట్టిగా తిప్పి మంచంపై పడుకున్నాడు. ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత.. ఆ వ్యక్తి లేచి మళ్లీ రెక్కలను తిప్పి పడుకుంటాడు. పవర్ వచ్చేవరకు సదురు వ్యక్తి ఇదే తంతు చేస్తుంటాడు.
ये टेक्निक भारत से बाहर नहीं जानी चाहिये. pic.twitter.com/dUUF0BlGQ2
— Awanish Sharan (@AwanishSharan) April 29, 2022
ఇందుకు సంబందించిన వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 'ఈ టెక్నిక్ భారతదేశంను దాటి బయటకు వెళ్లొద్దు' అని కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చుసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఈ మీడియాకు 4.36 లక్షల వ్యూస్ మరియు 14 వేల లైక్‌లు వచ్చాయి.
Also Read: Acharya Movie Collection: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా?
Also Read: Krithi Shetty Photos: చీరకట్టు అయినా మోడ్రన్ డ్రస్సు అయినా బేబమ్మ తర్వాతే ఎవరైనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook