Viral Video of man behaves like a kid to avoid vaccination: కరోనా వ్యాక్సినేషన్ (Covid 19 Vaccination) పట్ల ప్రజల్లో మొదట చాలా అపోహలు ఉండేవి. అప్పట్లో చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకాడారు. కొన్నిచోట్ల వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లిన హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే 100 శాతం తొలి డోసును పూర్తి చేశాయి. త్వరలోనే రెండో డోసు పంపిణీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత వేగంగా ముందుకెళ్తున్నా... అక్కడక్కడా ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు జంకుతూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కి (Chhattisgarh) చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చిన్నపిల్లాడిలా గోల గోల చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాంజ్‌గిర్ చంపా జిల్లాలోని భాటా గ్రామానికి చెందిన సుఖిరామ్ ఖాడియా ఇంటికి ఇటీవల హెల్త్ కేర్ సిబ్బంది వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లారు. ఆ సిబ్బందిని చూడగానే సుఖిరామ్ ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. దీంతో అతన్ని పట్టుకుని బలవంతంగా ఎత్తుకొచ్చారు. అప్పటికీ అతను జ్వరం వచ్చినవాడిలా వణికిపోతూ.. 'ఈ రాత్రే జీవితం.. రేపు మనం ఎక్కడనో..' అంటూ నోటికొచ్చిన  పాట అందుకున్నాడు. గట్టి గట్టిగా అరుస్తూ గోల గోల చేశాడు. చివరకు అక్కడున్నవాళ్లు అతన్ని పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. 


ఆ తర్వాత ఓ మహిళా సిబ్బంది తన చేతిలో వ్యాక్సిన్ పట్టుకుని అతని దగ్గరికెళ్లారు. అంతే.. ఆమెకు చేతులు జోడించి దండం పెడుతూ... వ్యాక్సిన్ వద్దంటూ వేడుకున్నాడు. ఎట్టకేలకు అంతా కలిసి అతన్ని కదలకుండా కూర్చోబెట్టి వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చేశారు. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనూ చిన్నపిల్లాడిలా అతను బిగ్గరగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.



Also Read: Corona cases in India: ఒక్క రోజులో 16,764 కరోనా కేసులు- ఒమిక్రాన్ బాధితులు @ 1,270


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook