Corona cases in India: ఒక్క రోజులో 16,764 కరోనా కేసులు- ఒమిక్రాన్ బాధితులు @ 1,270

Corona cases in India: దేశంలో కరోనా ఆందోళనలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్త కేసుల్లో నమోదవుతున్న వృద్ధి.. పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 10:20 AM IST
  • దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఆందోళనకరంగా ఒమిక్రాన్ వేరియంట్​​ కేసుల్లో వృద్ధి
  • మహారాష్ట్రలో ఒక్క రోజులోనే భారీగా కొవిడ్ కేసులు నమోదు
Corona cases in India: ఒక్క రోజులో 16,764 కరోనా కేసులు- ఒమిక్రాన్ బాధితులు @ 1,270

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,764 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 12,50,837 మందికి కొవిడ్ టెస్టులకు గానూ..ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 220 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,585 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

ఒమిక్రాన్ ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం (Omicron cases in India) 1,270 ఒమిక్రాన్​ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మహారాష్ట్రలో కరోనా మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఒక్క రోజులోనే ఇక్కడ 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్​ కేసుల్లో దాదాపు సగం (450) ఇక్కడే ఉండటం ఆందోళనకరమైన విషయం. ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్​లో 97, రాజస్థాన్​లో 69 ఒమిక్రాన్​ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91,361 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.26 శాతానికి పెరిగింది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,81,080 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశంలో 34,838,804 మందికి కరోనా సోకగా.. అందులో  34,266,363 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.36 శాతానికి తగ్గింది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 66,65,290 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య '1,44,54,16,714'కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 286,875,007 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,446,271 మంది మహమ్మారికి బలయ్యారు. 253,172,195 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 28,256,541 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Edible oil : మరింత భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు.. ఎంఆర్పీకే అమ్మండి!

Also read: Heavy rain in Chennai: చెన్నైలో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి.. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News