Monkey Video | సోషల్ మీడియా ( Social Media ) ఒక వింత ప్రపంచం. క్షణాల్లో జీరోను హీరో చేస్తుంది. హీరోను జీరోను చేస్తుంది. పైగా ఈ మధ్య అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ( Smart Phones ) ఉండటం వల్ల వెరైటీ వీడియోలు, ఫోటోలు మన ముందుకు సులువుగా వస్తున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోలో ఒక చిన్నారి చేతి నుంచి కోతి ఫోన్ లాక్కుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ వీడియోను ( Viral Video ) గమనిస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. మనుషులు జంతువులను ఇమిటేట్ చేసినప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుందో.. జంతువులు మనుషులను ఇమిటేట్ చేసినప్పుడు కూడా అంతే ఫన్నీగా ఉంటుంది. మనుషుల చేతిలో ఫోన్ చూసీ చూసీ అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది ఈ కోతి. 


అసలు ఏంటి ఇది .. మనుషులు దీన్ని చూడకుండా ఉండలేరు. మరి నేనెందుకు మిస్ అవ్వాలి. నేను కూడా చూస్తాను అని నిర్ణయించుకుంది ఈ కోతి. చిన్నారి చేతి నుంచి తీసుకుని చూడటం ప్రారంభించింది. అంతలోనే చిన్నారి ఫోన్ వెనక్కి తీసుకోవడంతో.. కోతి మళ్లీ దాన్ని తీసుకుని.. ఉండు పాప నేను ఒకసారి ఫీచర్స్ చెక్ చేసి ఇస్తా అన్నట్టు ప్రవర్తించింది. 


నెటిజెన్స్ ( Netizens ) ఇష్టపడుతున్న ఈ వీడియో మీరు కూడా చూడండి.




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR