Flight Door Opened Mid-air: ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇంతకు ముందు ఇలాంటి ఘటనను మీరు ఎప్పుడూ, ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. విని ఉంకపోవచ్చు. రష్యాకు చెందిన ఒక ఛార్టర్డ్ ఫ్లైట్ ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే పైలట్ డోర్ తెరవడంతో ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు అవి. విమానం ఆకాశంలో ఉండగానే డోర్ తెరవడంతో విమానంలో ఉన్న గాలి అంతా ఆకాశంలోకి వెళ్లిపోసాగింది. దీంతో విమానంలోని లగేజీ సైతం గాలిలోకి పీల్చుకుంది. విమానంలోని ప్రయాణికులను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యారియర్ ఐర్ఏరో అనే ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్రొపెల్లర్ విమానం సైబీరియాలోని మగన్ నుండి రష్యాలోని పసిఫిక్ తీరంలో ఉన్న మగడాన్‌కు బయలుదేరింది. విమానం మగడానికి వెళ్తుండగానే మార్గం మధ్యలోనే విమానం వెనుక తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంది. విమానంలో ఆ సమయంలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకులలోనే ఒకరు విమానం వెనుక తలుపు తెరుచుకున్నప్పుడు ఏం జరిగిందనే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



 


అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ఆ తర్వాత పైలట్ ఎలాగోలా మళ్లీ విమానాన్ని వెనక్కి తీసుకెళ్లి మగన్‌లోనే ల్యాండ్ చేశాడు. క్యారియర్ ఐర్ఏరో ఎయిర్ లైన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2800-2900 మీటర్ల ఎత్తులో విమానం తలుపు తెరుచుకుంది. వైరల్‌గా మారిన ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు ఆంటన్ గెరాష్‌చెంకో కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.


ఇది కూడా చదవండి : Viral Video: నీళ్లు తాగుతున్న జింకపైకి మెరుపు వేగంతో దూకిన మొసలి.. ఏం జరిగిందో మీరే చూడండి


ఇది కూడా చదవండి : Brother Sister Love Video: ఈ వైరల్ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవకపోతే ఒట్టు


ఇది కూడా చదవండి : King Cobra Snakes Dancing: పార్కింగ్ ఏరియాలో నాగుపాముల పోటాపోటి ఫైటింగ్.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook