Brother Sister Love Video: ఈ వైరల్ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవకపోతే ఒట్టు

Brother Sister Love Video: గొడవలు పడటం వరకు ఓకే కానీ కొంతమంది తిరిగి కలిసే ప్రయత్నం కూడా చేయరు. ఒకరిపై మరొకరు పంతాలకు పోయి ఎప్పటికీ అలాగే ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల అన్నా చెల్లెళ్లు, అక్కా - తమ్ముళ్ల బంధంలోని అనురాగాన్ని, అనుబంధాన్ని ఆస్వాదించలేకపోతుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 05:10 PM IST
Brother Sister Love Video: ఈ వైరల్ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవకపోతే ఒట్టు

Brother Sister Love Video: చిన్నప్పటి నుంచి అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. ఇంకొన్ని సందర్భాల్లో ప్రతీ చిన్న విషయానికి తగవులాడే వాళ్లూ ఉంటారు. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టామ్ అండ్ జెర్రీ లాగా దేనికి పడితే దానికి గొడవలు పడుతుండటం చాలానే చూస్తుంటాం. అయితే, ఎంత గొడవ పడినా.. అవసరం వచ్చినప్పుడు ఇద్దరూ ఏకం అవుతారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి అవతలి వాళ్లకు ధీటుగా సమాధానం ఇస్తారు. అందుకే ఆ టామ్ అండ్ జెర్రీ గొడవలకు ప్రేమ అనే పేరు పెట్టారు. 

గొడవలు పడటం వరకు ఓకే కానీ కొంతమంది తిరిగి కలిసే ప్రయత్నం కూడా చేయరు. ఒకరిపై మరొకరు పంతాలకు పోయి ఎప్పటికీ అలాగే ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల అన్నా చెల్లెళ్లు, అక్కా - తమ్ముళ్ల బంధంలోని అనురాగాన్ని, అనుబంధాన్ని ఆస్వాదించలేకపోతుంటారు. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూపించండి.. తోబుట్టువుల బంధంలో ఉండే కేరింగ్ , షేరింగ్ ముందు ఏ పంతమూ పని చేయదని వాళ్లకు అర్థం కాకపోతే ఒట్టు.

 

ఒక కుర్రాడికి తన చిన్నారి చెల్లిని సైకిల్ పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే, వెనక క్యారియర్ పై కూర్చున్న ఆ చిన్నారి చెల్లి ఎక్కడ కిందపడిపోతుందో లేక ఆమె కాళ్లు సైకిల్ చక్రాల్లో పడతాయేమో అనే భయంతో ఆ చిన్నోడు చేసిన పని చూస్తే ముచ్చటేస్తుంది. చిన్నారి చెల్లి రెండు కాళ్లను సైకిల్ ముందు భాగంలో ఉన్న పైప్ కి కట్టేసి ఆమెను జాగ్రత్తగా సైకిల్ పై తీసుకెళ్లడం చూస్తే కచ్చితంగా మీకు మీ తోబుట్టువు గుర్తురాకపోతే అడగండి. అంత చిన్న వయస్సులోనే ఆ కుర్రాడి తెలివి, చెల్లి కోసం తీసుకునే కేరింగ్ చూస్తే ఔరా అని అనిపించకమానదు.

ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 16 వేలకు పైగా లైక్స్ రాగా, దాదాపు 12 వందల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

ఇది కూడా చదవండి : Baby Monkey Girl Viral Video: మానవ మమ్మీ నుంచి బేబీ కోతి దూరం.. హృదయాలను కదిలించే వీడియో!

ఇది కూడా చదవండి : King Cobra Snakes Dancing: పార్కింగ్ ఏరియాలో నాగుపాముల పోటాపోటి ఫైటింగ్.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Viral Video: బస్సు డ్రైవర్‌తో పెట్టుకున్న సైకిలిస్ట్.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News