Viral Video: నీళ్లు తాగుతున్న జింకపైకి మెరుపు వేగంతో దూకిన మొసలి.. ఏం జరిగిందో మీరే చూడండి

Animals Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి వీడియోను చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరించడం ఖాయం. కంటికి కనిపించనంత వేగంతో దూకిన మొసలి బారి నుంచి ఆ జింక పిల్ల ఎలా తప్పించుకుందా అనే సందేహం రాకమానదు. ఆ ఒక్క సందేహం ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 10:20 PM IST
Viral Video: నీళ్లు తాగుతున్న జింకపైకి మెరుపు వేగంతో దూకిన మొసలి.. ఏం జరిగిందో మీరే చూడండి

Animals Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు మరుగున పడుతుంటాయి. అలా వైరల్ అయిన వీడియోల్లోనూ కొన్ని వీడియోలు మరీ ప్రత్యేకం అనిపించుకుంటాయి. అలాంటి వీడియోలు మన కళ్లని మనమే నమ్మలేం అన్నట్టుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూసి మనం చూస్తున్నది నిజమేనా అని నిర్ధారించుకోవాలి అని అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న వైరల్ వీడియో కూడా అలాంటిదే. 

అడవిలో ఒక నీటి కొలను వద్ద చిన్న జింక పిల్ల నీళ్లు తాగుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. నీళ్లలో దాగి ఉన్న మొసలి.. గుట్టుచప్పుడు కాకుండా నీళ్ల కింది నుంచే వచ్చి ఉన్నట్టుండి మెరుపు వేగంతో జింకపైకి దూకింది. కళ్లుమూసి తెరిసేలోగానే.. కేవలం రెప్పపాటు కాలంలో ఈ దాడి జరిగింది. జింక ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. మొసలి దూకిన వేగానికి దాని నోటికి చిక్కి బలయ్యేదే. కానీ జింక కూడా చాలా అప్రమత్తంగానే వ్యవహరించింది. నీళ్లు తాగుతున్నంతసేపూ నాలుగు కాళ్లపై వెంటనే వెనక్కి దూకడానికి పొజిషన్ తీసుకున్నట్టుగానే ఉన్న ఆ జింక.. ఆ సమయంలో మొసలి రాకను గమనించడంతోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెంగున వెనక్కి దూకి తప్పించుకుంది. 

ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి వీడియోను చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరించడం ఖాయం. కంటికి కనిపించనంత వేగంతో దూకిన మొసలి బారి నుంచి ఆ జింక పిల్ల ఎలా తప్పించుకుందా అనే సందేహం రాకమానదు. ఆ ఒక్క సందేహం ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది. అందుకేనేమో నెటిజెన్స్ నుంచి ఈ వీడియోకు భారీ స్పందన కనిపిస్తోంది.

Trending News