Viral Video: యాత్రికులను బెంబేలెత్తించిన స్నేక్.. ఒక్కసారిగా బుసలు కొడుతూ ఎటాక్..
Viral Video: సోషల్ మీడియాలో ఓ స్నేక్ వీడియో హల్చల్ చేస్తోంది. ఓ కొండ మార్గంలో వెళ్తున్న కొంతమంది యాత్రికులపై ఆ పాము ఒక్కసారిగా బుసలు కొట్టింది.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతీ రోజూ బోలెడు వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓ స్నేక్ కొంతమంది యాత్రికులను బెంబేలెత్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ యాత్రికులు ఓ కొండపై ఇరుకు మార్గంలో వెళ్తున్న క్రమంలో.. తోవ పక్కనే ఉన్న ఓ పాము ఒక్కసారిగా వారిపై బుసలు కొట్టింది. ముందు వెళ్తున్న యువతిని కాటేసినంత పనిచేసింది. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నార్త్ థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ అనే ప్రాంతంలో ఈ నెల 20న ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్‌హాగ్ అనే యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. వీడియో టైటిల్‌లో ఆ స్నేక్‌ని ర్యాట్ స్నేక్‌గా పేర్కొన్నారు. ర్యాట్ స్నేక్స్ విషపూరితం కావని.. అయితే మనిషిని గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేయగలవని చెబుతున్నారు. పేరుకు తగినట్లే ఆ స్నేక్స్‌కి ర్యాట్స్ ఫేవరెట్ ఫుడ్ అని చెబుతున్నారు.
ఇటీవల ఇదే థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో ఆకుపచ్చ రంగులో, డ్రాగన్‌ని తలపించే ఓ వింత పాము బయటపడిన సంగతి తెలిసిందే. ఒళ్లంతా నాచుతో చూసేందుకు చాలా వింతగా ఉన్న ఈ పాము వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఈ పామును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.