Tiger Viral Videos : టైగర్ అంటేనే మృగరాజు అంటాం. అడవిలో మృగాలకు రాజు అయిన పులి కూడా రోడ్డు మీదకు వస్తే ఆచితూచి అడుగేయాల్సిందే. లేదంటే పులికైనా సరే సేఫ్టీ కష్టమే. అడవిలో రోడ్డు దాటేందుకు తిప్పలు పడుతున్న ఓ పులి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విటర్ ద్వారా తరచుగా వీడియోలు షేర్ చేస్తుండటం మీరు కూడా చూసే ఉండొచ్చు. సుశాంత నంద పోస్ట్ చేసే జంతువుల వీడియోలు చాలా వరకు నెటిజెన్స్‌ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సుశాంత నంద పోస్ట్ చేసిన టైగర్ వీడియో కూడా అలాంటిదే. అటవీ ప్రాంతంలోంచి వెళ్తున్న హైవే మార్గాన్ని దాటేందుకు వచ్చిన ఓ పులి.. రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లే వరకు వేచిచూడాల్సి రావడం ఈ వీడియోలో వీక్షించవచ్చు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూనే సుశాంత నంద ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అభివృద్ధితో వణ్యప్రాణుల పరిస్థితి ఎలా తయారైందో చూడండి అంటూ సుశాంత నంద చేసిన వ్యాఖ్యలపై భారీ సంఖ్యలో నెటిజెన్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు.


మౌళిక వసతులు పేరిట అడవిలోంచి హైవే మార్గాలు నిర్మించడంతో అడవిలో తిరిగే వణ్యప్రాణులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నాయని.. అడవిలోంచి వెళ్లే హైవేల కారణంగా వణ్యప్రాణుల సంరక్షణ సంకటంలో పడుతోందని నెటిజెన్స్ చెబుతున్నారు.


అడవిలో హైవేలపై అక్కడక్కడా అండర్ పాస్ బ్రిడ్జిలు లేదా ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే.. వణ్యమృగాల సేఫ్టీకి డోకా ఉండదు కదా అని కొంతమంది సూచిస్తున్నారు. 


అడవిలోపలికి వెళ్లి వాటి స్థావరాన్ని మానవులు కబ్జా చేస్తుండటంతో వాటికి బతికేందుకు స్థలం కరువై గ్రామాల్లోకి వస్తున్నాయని ఇంకొంతమంది కామెంట్ చేశారు. 



 


ఈ వీడియోపై మరో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కస్వన్ స్పందిస్తూ.. సరిగ్గా ఈ వీడియోలో చూసిన చోటే వణ్యప్రాణులు రోడ్డు క్రాస్ చేసేందుకు వీలుగా ఓ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని.. ఇదొక పాజిటివ్ అంశం అని తెలిపారు. 


నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 టైగర్ సెన్సస్ ప్రకారం ఇండియాలో 2967 పులులు ఉన్నాయి. 2014 లో 2226 గా ఉన్న ఈ సంఖ్య 2018 నాటికి 2967 కి పెరిగింది. అలాగే 2022 టైగర్ సెన్సస్ గణాంకాలు ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నారు. అప్పటికి ఇండియాలో పులుల సంఖ్య 3 వేలకు పైనే ఉంటుందని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇది కూడా చదవండి : Slowest Train in India: ఈ ట్రైన్ స్పీడ్ గంటకు 10 కిమీలే.. అయినా తగ్గని భారీ డిమాండ్..


ఇది కూడా చదవండి : Free Condoms On Valentine's Day: వాలెంటైన్స్ డే రోజున ఫ్రీ కండోమ్స్.. ఎందుకో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe Twitter , Facebook