American dance for Pushpa item song: ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పాటలు ఫారినర్స్‌ను కూడా ఉర్రూతలూగిస్తున్నాయి. పాటలకు అర్థం తెలియకపోయినా ఆ మాస్ బీట్స్‌కు తగ్గట్లు కాలు కదుపుతున్నారు. తాజాగా రిక్కీ పాండ్ అనే ఓ అమెరికన్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. సమంత ఐటెం నంబర్ 'ఊ అంటావా మావా... ఉ ఊ అంటావా మావా...' సాంగ్‌కు దుమ్ములేపే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ సెన్సేషన్ రిక్కీ పాండ్ సోషల్ మీడియాలో 'డ్యాన్సింగ్ డాడ్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఎన్నో పాటలకు తనదైన శైలిలో అద్భుతమైన స్టెప్పులేశాడు. రెండు రోజుల క్రితం రిక్కీ తన ఇన్‌స్టాలో లేటెస్ట్ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేశాడు. అందులో పుష్ప సాంగ్ 'ఉ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా..' సాంగ్‌కు స్టెప్పులు ఇరగదీశాడు. 


ముఖంపై చిరునవ్వుతో ఎనర్జిటిక్‌గా, హుషారుగా సింప్లీ సూపర్బ్ అనేలా రిక్కీ ఆ పాటకు స్టెప్పులు వేశాడు. అంతేనా... వీడియో (Viral Video) చివరలో అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలా...' అని పోజివ్వడం బిగ్ హైలైట్ అని చెప్పాలి. 'వేరే లెవల్ మామా..' అంటూ రిక్కీ పాండ్ స్టెప్పులపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'సార్ అద్భుతమైన డ్యాన్స్... మీరు ఇండియా వచ్చి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేయాలి...' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.



Also Read: Corona in India: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం- ఒక్క ముంబయిలోనే 20 వేలకుపైగా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook