Viral Video Of Talking Cactus Toy: ఇటీవల కాలంలో భారీగా పాపులారిటీ సాంపాదించుకున్న ఆట బొమ్మల్లో టాకింగ్ క్యాక్టస్ టాయ్ కూడా ఒకటి. మరీ ముఖ్యంగా ఈ మాట్లాడే క్యాక్టస్ బొమ్మలు వైరల్ అవడానికి కారణం వాటిని తయారుచేస్తోన్న కంపెనీలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వడం వల్ల కాదు.. ఆ బొమ్మలతో పిల్లలు ఆడుతున్న వీడియోలను షూట్ చేస్తోన్న పేరెంట్స్ ఆ వీడియోలను షాట్స్, రీల్స్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటమే. అలా పోస్ట్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుండటంతో ఇప్పుడు క్యాక్టస్ టాయ్స్ వీడియోస్‌కి మంచి ఆధరణ కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా వీక్షకులను అదే విధంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. టాకింగ్ క్యాక్టస్ టాయ్‌తో ఆడుతున్న ఓ చిన్నారి తనకు తెలియకుండానే ఆ బొమ్మతో సీరియస్‌గా ముచ్చటలో మునిగిపోయింది. తను చెప్పే మాటలకు రిప్లై ఇస్తున్న టాకింగ్ క్యాక్టస్ టాయ్ ఒక ఆట బొమ్మ అనే విషయం తెలిసో తెలియకో కానీ ఆ చిన్నారి తన ఎదురుగా ఉన్న బొమ్మతోనే వాదనకు దిగుతోంది. 



 


వైరల్ వీడియో చూడ్డానికి మరో రకంగానూ ఉంది అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. టాకింగ్ క్యాక్టస్ టాయ్ కొనుగోలు చేసేటప్పుడు ఆ బొమ్మ సరిగ్గా పని చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి పెద్దలు ఎలాగైతే ఏదో ఒకటి మాట్లాడి చూస్తారో... ఈ చిన్నారి కూడా అచ్చం అలాగే చెక్ చేస్తున్నట్టుగా ఉంది. నేను ఏది చెబితే అది నువ్వు తిరిగి చెబుతావా లేదా అన్నట్టుగా ఆ ఆట బొమ్మ ముందు ఈ చిన్నారి గట్టిగా గట్టిగా అరుస్తూ.. ఆ బొమ్మ కూడా అరిచేలా చేస్తూ బొమ్మ క్వాలిటీని చెక్ చేస్తున్నట్టుగా ఉంది కదూ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.


ఇది కూడా చదవండి : Rs. 54 Lakhs Bill For 10 Days: 10 రోజుల చికిత్సకు 54 లక్షల బిల్లు.. పేషెంట్‌ని విడిచేది లేదంటున్న హాస్పిటల్


ఇది కూడా చదవండి : Viral Video: విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా


ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook