గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతున్నా... ముఖంపై చిరునవ్వు చెరగనివ్వకూడదు అంటారు. నవ్వుతూ ఉండాలి తమ్ముడూ అని కూడా అంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. సానుకూలంగా ఆలోచించడం ( Positive Thinking ) వల్ల కష్టాల కడలిని సులువుగా దాటేయగలరు. దీనికి ఉదాహరణ బురదలో కమలం వికసించడం. ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పడానికి కారణం.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో (Trending Video ). ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది.



ఇందులో ఇద్దరు సీనియర్ సిటిజెన్స్ ఒక హిందీ పాటకు డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ప్రపంచాన్ని మరిచి, కరోనాకష్టాలను మరిచి డ్యాన్స్ చేస్తుంటారు. అది చూసి చుట్టపక్కల వాళ్లుకూడా  ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చిన్ని వీడియో ఎన్నో నేర్పించగలదు. అయితే వీళ్లు మాస్క్ వేసుకుని ఉంటే బాగుండేది అని నెటిజెన్స్ ( Netizens ) కామెంట్ చేస్తున్నారు.