Real snake appears on Ganesh idol in jagitial video:  దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన కూడా ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటూ ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించుకుంటున్నారు. చాలా మంది భజనలు చేస్తు తమ భక్తిని సైతం చాటుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు కూడా.. గణేష్ ఉత్సవాలను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



గణపతి బొప్పా మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సాధారణంగా పాము అనేది శివుడికి కంఠాభరణంగా ఉంటుందని మనకు తెలిసిందే. అదే విధంగా పాము గణేషుడికి కడుపుకు కూడా ఆధారంగా ఉంటుంది. పామును నాగదేవతగా భక్తితో కొలుచుకుంటారు. పాములు కన్పిస్తే చాలా మంది అపకారం చేయకుండా స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. ఈ క్రమంలో ఒక పాము... ఏకంగా గణపయ్య విగ్రహాం మీద ఎక్కి కాసేపు హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


జగిత్యాలలోని ఒక వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది. స్థానికంగా.. వాణి నగర్ లోని త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో.. 40 అడుగుల గణపయ్యను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈరోజు (సెప్టెంబరు 16న) ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఒక నాగు పాము వినాయకుడి మండపంకు వచ్చింది. అది ఏకంగా గణేషుడి మెడలో ఎక్కింది. అక్కడే కాసేపు బుసలు కొడుతూ ఉండిపోయింది. దీంతో అక్కడి వారు గమనించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


Read more: Viral Video: ముదురుతున్న వివాదం.. ముస్లిం వేషధారణలో గణపయ్య విగ్రహాం.. వీడియో వైరల్..  


ఒకవైపు గణేషుడి మెడలో పాము ఉండటంతో పాటు..  శివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొవడంతో స్థానికులు  పెద్ద  ఎత్తున ఈ వినాయకుడి దగ్గరకు వచ్చారు. పాముతో పాటు, గణేషుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు గణేషుడి మహిమగా చెప్పుకుంటున్నారు. మరికొందరు వావ్.. గణేషుడి మీద సర్పం ఆభరణంగా.. భలే ఉందే..అంటూ కూడా కామెంట్లు జతచేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.