Royal Swan Blocks Train In London: ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపడం చూశాం. ఒక్కోసారి జంతువులు ట్రాక్ పై నడుస్తున్నప్పుడు ట్రైన్ డ్రైవర్ రైలును ఆపడం చూసుంటాం. కానీ హంస కోసం రైలును ఆపడం ఎప్పుడైనా చూశారా ఇది నిజం. రైలు పట్టాలపై హంస సంచరిస్తోందని లండన్ లో ట్రైన్ ను పావు గంట ఆపేశారు. దీంతో ప్యాసింజర్స్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లండన్ లోని బిష‌ప్ రైల్వే స్టేష‌న్లో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ హంస వచ్చి పట్టాలపై హుందాగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఓ ట్రైన్ సడన్ గా వస్తూ ఉంటుంది. అయితే హంసను చూచిన ట్రైన్ డ్రైవర్ ఒక్కసారిగా రైలును ఆపేశాడు. హంస పట్టాల మీద ఉన్నంత సేపు ఆ రైలు కదల్లేదు. పావు గంట సేపు ఆ హంస పట్టాలపైనే తిరుగుతూ కనిపించింది. ప్యాసింజర్స్ కూడా అలా చూస్తూ ఉన్నారు తప్ప ఏం మాట్లాడలేదు. దీంతో పలు రైళ్లు కూడా ఆలస్యమయ్యాయి. ఈ వీడియోను కెమెరాతో రికార్డు చేసి  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఓ ప్రయాణికుడు. ఈ వీడియో ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా వ్యూస్‌,  96 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 



Also Read:Viral Video: ఇదేం పాడుపని బాబోయ్.. ఎంత తెలివిగా "స్మార్ట్ ఫోన్'' కొట్టేశాడో.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే...


బ్రిటన్ లో ఇప్పటికీ హంసలకు చెందిన చట్టాలు అమలులో ఉన్నాయి. వేటగాళ్ల బారి నుంచి హంసలను రక్షించాలనే ఉద్దేశంతో ఆ చట్టాలను అమలు చేస్తున్నారు. సాధారణంగా అక్కడ అన్‌మార్క్‌డ్ హంస‌ల‌ను రాజ కుటుంబ ఆస్థిగా భావిస్తారు. కేవ‌లం బ్రిటీష్ రాచ కుటుంబీకులు మాత్ర‌మే ఈ హంస‌ల‌ను తినేందుకు అధికారం ఉన్న‌ది. ఈ హంసలకు ఎటువంటి హాని క‌లిగించినా.. లేక వాటిని ఎత్తుకెళ్లే ప్ర‌య‌త్నం చేసినా ఆ దేశంలో నేర‌మే అవుతుంది. ఈ క్రమంలో తాజా హంస వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


Also Read: Leopards fight video: చెట్టుపై భయంకరంగా కట్టుకున్న చీతాలు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook