Snake viral videos: చాలా  మంది పాములను చూడగానే పదడుగుల దూరం పారిపోతుంటారు. అసలు పాముల పేర్లు ఎత్తేందుకు కూడా సాహాసం చేయరు. చెట్లు, అడవులు, కొండలు ఉన్న ప్రాంతాలలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి.  దట్టంగా ఉన్న చెట్లు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పాములకు  చెందిన వెరైటీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొన్ని ఆశ్చర్యాన్ని కల్గించేవిలా ఉంటాయి. పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్ లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది పాములు కన్పించగానే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. అంతే కాకుండా.. పాములకు ఆపద కల్గించకూడదని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో పాములకు చెందిన ఒక భయానక వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


సాధారణంగా పొలాల్లో పాములు ఉంటాయని మనకు తెలిసిందే. చాలా మంది రైతులు పొలం పనులు చేసేటప్పుడు వాళ్ల ముందు నుంచి లేదా పక్కల నుంచి పెద్ద పెద్ద పాములు వెళ్తుంటాయి. కొంత మంది రైతులు పాముల కాటుకు గురై చనిపోతుంటారు కూడా. ఇక్కడోక రైతు తన పొలంలో టమాటా పంటను వేసుకున్నాడు. అయితే.. ఒక పాముపిల్ల టమాటాల దగ్గరకు వెళ్లింది. మరీ దాన్ని చూసి ఎర అనుకుందో.. మరేంటో కానీ.. ఒక్కసారిగా మనిషిని కాటు వేసినట్లు కసితీరా తన కోరలతో కాటు వేసింది.  


అంతే కాకుండా.. పాము పిల్ల.. టమాటాను మింగేందుకు ప్రయత్నించింది. కొంచెం సేపు  తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. సదరు రైతు.. తన పొలంలో ఎవరు దొంగలు పడకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దానిలో ఆ పాము టమాటాను కాటువేస్తున్న ఘటన రికార్డు అయ్యింది.


Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్..


ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ టమాటాను తిన్న వారి పరిస్థితి ఏంటని కూడా నెటిజన్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము చుక్క విషంలో కూడా మనిషి చనిపోయే విధంగా ప్రభావం ఉంటుందని చెప్తుంటారు. ఆ వీడియో చూస్తుంటే.. టమాటాలను తినాలంటేనే భయమేస్తుందంటూ కూడా నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.